రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు... రూ. 56 లక్షల అప్పు ఎగ్గొట్టాడని ఫిర్యాదు

సినీ దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఒక వ్యక్తి ఆయన అప్పు తీసుకొని ఎగ్గొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ సినిమా కోసం రూ. 56 లక్షల అప్పుగా తీసుకున్నాడని.. ఆ తర్వాత తిరిగి చెల్లించలేదని ఒక ఫైనాన్షియర్ కేసు పెట్టాడు. కోర్టు దావా ద్వారా ఆయనపై ఫిర్యాదు చేయడంతో మియాపూర్ పోలీసులు ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నా స్నేహితుడి ద్వారా ఆర్జీవీతో 2019లో పరిచయం […]

Advertisement
Update:2022-05-25 05:47 IST

సినీ దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఒక వ్యక్తి ఆయన అప్పు తీసుకొని ఎగ్గొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ సినిమా కోసం రూ. 56 లక్షల అప్పుగా తీసుకున్నాడని.. ఆ తర్వాత తిరిగి చెల్లించలేదని ఒక ఫైనాన్షియర్ కేసు పెట్టాడు. కోర్టు దావా ద్వారా ఆయనపై ఫిర్యాదు చేయడంతో మియాపూర్ పోలీసులు ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నా స్నేహితుడి ద్వారా ఆర్జీవీతో 2019లో పరిచయం అయ్యిందని.. దిశ అనే సినిమా కోసం తన దగ్గర డబ్బు సాయం కోసం వచ్చాడని.. అప్పుడు రూ. 8 లక్షలు ఇచ్చానని సదరు ఫైనాన్షియర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత మరో రూ. 20 లక్షలు కావాలని అడగటంతో 2020 జనవరి 22న ఆ డబ్బును చెక్ రూపంలో ఇచ్చానని తెలిపాడు. ఆ తర్వాత నెలలో మరోసారి డబ్బులు అడిగితే రూ. 28 లక్షలు సర్ధుబాటు చేశానని చెప్పాడు. పలు మార్లు డబ్బులు అడిగి మొత్తం రూ. 56 లక్షలు తీసుకున్నాడని.. ఈ డబ్బంతా దిశ సినిమా విడుదలకు ముందే.. లేదంటే సినిమా రిలీజ్ రోజు తిరిగి ఇస్తానని వర్మ హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే దిశ సినిమాకు వర్మ నిర్మాత కాకపోవడంతో తాను ఆ సినిమాపై ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదన్నారు. కానీ, ఆ సినిమాకు తానే నిర్మాతనని చెప్పి వర్మ తనను మోసం చేశాడని సదరు ఫైనాన్షియర్ చెప్పాడు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని మియాపూర్ పోలీసులను విజ్ఞప్తి చేశాడు. పోలీసులు ప్రస్తుతం ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News