మేజర్ సెన్సార్ టాక్..
అడివి శేష్ హీరోగా నటించిన సినిమా మేజర్. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీంతో సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినట్టయింది. అంతేకాదు, రిలీజ్ కు కౌంట్ డౌన్ కూడా మొదలైనట్టయింది. సెన్సార్ టాక్ ప్రకారం, ఈ సినిమా చాలా ఎమోషనల్ గా ఉందని తెలుస్తోంది. మేజర్ సినిమాపై యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. అందుకే విడుదలకు చాలా రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా […]
అడివి శేష్ హీరోగా నటించిన సినిమా మేజర్. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీంతో సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినట్టయింది. అంతేకాదు, రిలీజ్ కు కౌంట్ డౌన్ కూడా మొదలైనట్టయింది. సెన్సార్ టాక్ ప్రకారం, ఈ సినిమా చాలా ఎమోషనల్ గా ఉందని తెలుస్తోంది.
మేజర్ సినిమాపై యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. అందుకే విడుదలకు చాలా రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్లు ఏర్పాటుచేశారు. అవి రేపట్నుంచే మొదలు కాబోతున్నాయి. ఈ మేరకు బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకుంది మేజర్ యూనిట్. సినిమాను జూన్ 3 న విడుదల చేయబోతున్నారు.
మరోవైపు సినిమా ప్రచారాన్ని కూడా భారీ ఎత్తున చేపడుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ బయటకొచ్చింది. రేపు హృదయమా అనే సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. సిద్ శ్రీరామ్ ఈ పాట పాడాడు. ఈ సాంగ్ తో ప్రమోషన్ పీక్ స్టేజ్ కు చేరుతుందని యూనిట్ భావిస్తోంది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది మేజర్ సినిమా. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, AS మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.