కేటీఆర్ మంత్రాంగం... తెలంగాణకు భారీగా తరలి వస్తున్న పెట్టుబడులు
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో చురుకుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అనుకున్నదానికన్నా ఎక్కువే ఫలితాలనిస్తున్నాయి. సమావేశాల మొదటి రోజే స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్, ఫైనా న్స్, బీమా రంగ సంస్థ స్విస్‌రీ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు […]
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో చురుకుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అనుకున్నదానికన్నా ఎక్కువే ఫలితాలనిస్తున్నాయి.
సమావేశాల మొదటి రోజే స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్, ఫైనా న్స్, బీమా రంగ సంస్థ స్విస్‌రీ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్ అలీ ముందుకు వచ్చారు. అలాగే స్పెయిన్‌కు చెందిన బహుళజాతి సంస్థ కీమో ఫార్మా హైదరాబాద్‌లో 100 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఈ-కామర్స్ సంస్థ ‘మీషో’ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
ఇవే కాకుండా ఈ రోజు అలియాక్సిస్ సంస్థకు చెందిన ఆశీర్వాద్ పైప్స్ 500 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ తొలి కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దావోస్ లో మంత్రి కేటీఆర్ తో అలియాక్సిస్ సిఎఫ్ఓ కోయెన్ స్టిక్కర్ సమావేశం అనంతరం సంస్థ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అలియాక్సిస్ సంస్థ ప్లాస్టిక్ పైప్స్, ఫిట్టింగ్‌లు ఇతర ఉపకరణాలు తయారు చేస్తుంది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలోని 500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.