పక్రియ నుంచి ఎమ్మెల్సీని ఎవరూ తప్పించలేరు- అంబటి రాంబాబు
ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్, నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుపై కేసు నమోదు చేశారని, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చూపుతారని, కోర్టులో హాజరుపరుస్తారని ఈ పక్రియ నుంచి ఆయన్ను తప్పించడం ఎవరి వల్ల కాదని మంత్రి వ్యాఖ్యానించారు. అలా తప్పించాలన్నది తమ పార్టీ విధానం కాదన్నారు. ఆయన నేరం చేశారా లేదా అన్నది కోర్టులే తేలుస్తాయన్నారు. తొలి నుంచి పార్టీలో ఉండడంతోపాటు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన […]
ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్, నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుపై కేసు నమోదు చేశారని, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చూపుతారని, కోర్టులో హాజరుపరుస్తారని ఈ పక్రియ నుంచి ఆయన్ను తప్పించడం ఎవరి వల్ల కాదని మంత్రి వ్యాఖ్యానించారు. అలా తప్పించాలన్నది తమ పార్టీ విధానం కాదన్నారు. ఆయన నేరం చేశారా లేదా అన్నది కోర్టులే తేలుస్తాయన్నారు.
తొలి నుంచి పార్టీలో ఉండడంతోపాటు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టే ఆయన్ను జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా నియమించారని చెప్పారు. ఆయనే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు కుటుంబసభ్యులు ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగా కేసు నమోదు చేశారన్నారు. విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న తేలడంతో పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారన్నారు. ఆయన తమ పార్టీ ఎమ్మెల్సీ అయినా సరే తప్పు చేసి ఉంటే శిక్షించాల్సిందేనన్న భావనతోనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ అయినా సరే ఇంత కఠినంగా ఉన్నందుకు అభినందించాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయించిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు.
తనపై 14 కేసులు పెట్టారు… అయినా ఏం పీకారని నారా లోకేష్ మాట్లాడుతున్నారని.. అసలు పీకడానికి నారా లోకేష్ దగ్గర ఏముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్టుగా లోకేష్ తీరు ఉందన్నారు. చంద్రబాబు పరమ పండితుడా అన్న ప్రశ్న రావొచ్చు అని.. వెన్నుపోట్లు పొడవడంలోనూ, మోసాలు చేయడంలోనూ, ఎమ్మెల్యేలను కొనడంలోనూ, డబ్బు పంచడంలో చంద్రబాబు పండితుడేనన్నారు.
నారా లోకేష్‌కు పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదని..విదేశాల్లో చదివాడో లేక స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో ఉన్నారో ఏమో తెలియదన్నారు. తనను గంట, అరగంట అని లోకేష్ మాట్లాడుతున్నారని.. తిరిగి తాను ఏమైనా అంటే లోకేష్, అతడి అమ్మ, అతడి నాన్న మీడియా ముందుకు వచ్చి బోరున ఏడుస్తారన్నారు. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ కుటుంబం వద్దకు వెళ్లి అక్కలను, చెల్లెళ్లను కూర్చోబెట్టి తనపై పడి బోరున ఏడుస్తారని అంబటి విమర్శించారు.
మంగళగిరిలో ఇలాగే మాట్లాడడం వల్లనే తిరునాళ్లలో పిచ్చికుక్కను కొట్టినట్టు లోకేష్‌ను కొట్టారన్నారు. నారా లోకేష్ పార్టీకి పట్టిన శని అని టీడీపీ నేతలే అంటున్నారని.. టీడీపీ నేతల వ్యాఖ్యలను స్వయంగా లోకేష్ వింటే గుండె ఆగిపోతుందన్నారు. మరోసారి గంట, అర గంట అని నారా లోకేష్ నోరు జారితే.. తాను పది సార్లు నోరు జారాల్సి ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని అంబటి హెచ్చరించారు.
ALSO READ: అనంతబాబు అరాచకాల చిట్టా.. మచ్చుకు కొన్ని