ఎమ్మెల్సీ అనంతబాబుపై బొత్స కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లో క్రిమినల్స్‌ను ప్రోత్సహించిన ఫలితాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు రూపంలో ఇప్పుడు వైసీపీ ఎదుర్కొంటోంది. తన తండ్రి కాలం నుంచి అనేక నేరాపరణలు ఉన్నా, ఏకంగా తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్‌తో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించిన విషయం జగమంతా తెలిసినా, అనంతబాబుపై అప్పటికే రౌడీషీట్ ఉన్నా.. ఆ రౌడీషీట్‌ను ఎత్తివేసి మరీ ఎమ్మెల్సీని చేశారు. దాంతో మరింత రెచ్చిపోతూ మన్యంలో అక్రమ సంబంధాలతో పాటు.. కలప అక్రమ రవాణా, రంగు రాళ్ల తవ్వకాలు వంటి అక్రమాలతో.. ఏజెన్సీ వీరప్పన్‌ […]

Advertisement
Update:2022-05-23 01:17 IST

రాజకీయాల్లో క్రిమినల్స్‌ను ప్రోత్సహించిన ఫలితాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు రూపంలో ఇప్పుడు వైసీపీ ఎదుర్కొంటోంది. తన తండ్రి కాలం నుంచి అనేక నేరాపరణలు ఉన్నా, ఏకంగా తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్‌తో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించిన విషయం జగమంతా తెలిసినా, అనంతబాబుపై అప్పటికే రౌడీషీట్ ఉన్నా.. ఆ రౌడీషీట్‌ను ఎత్తివేసి మరీ ఎమ్మెల్సీని చేశారు.

దాంతో మరింత రెచ్చిపోతూ మన్యంలో అక్రమ సంబంధాలతో పాటు.. కలప అక్రమ రవాణా, రంగు రాళ్ల తవ్వకాలు వంటి అక్రమాలతో.. ఏజెన్సీ వీరప్పన్‌ అని పిలిపించుకునే స్థాయికి అనంతబాబు వెళ్లారన్న విమర్శలున్నాయి. తాను ఎన్ని నేరాలు చేస్తున్నా అవి తన ఎదుగుదలకే పనికొస్తున్నాయన్న భావనతో ఉన్న అనంతబాబు.. చివరకు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇరుకున్నారు. సుబ్రహ్మణ్యంది హత్యేనని, అతడిని చిత్రహింసలు పెట్టారని, మర్మాంగాలపైనా గట్టిగా కొట్టారని పోస్టుమార్టం నివేదిక చెబుతున్నా.. ఆయన్ను ఇప్పటికీ అరెస్ట్ చేయడం లేదు.

ఇంత తీవ్రమైన కేసులోనూ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి.. పోస్టుమార్టం నివేదిక అందగానే తదుపరి చర్యలంటూ మాట్లాడుతున్నారు. అసలు ఎమ్మెల్సీ ఎక్కడున్నారో కూడా తమకు తెలియదన్నట్టు అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కొందరు పెద్దలు అనంతబాబును వెనుకొచ్చే తరహాలో మాట్లాడుతున్నారు. అనంతబాబు వివాహాలకు హాజరవుతున్నారంటే.. తప్పు చేయలేదన్న ధైర్యం ఉండొచ్చు అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ఘటన జరిగిన రోజే భార్య,తల్లి వాంగ్మూలం ఇచ్చి ఉంటే ఈపాటికే ఎమ్మెల్సీ అరెస్ట్ అయి ఉండేవారని, మృతుడి కుటుంబసభ్యులే రెండురోజుల పాటు నిర్లక్ష్యం చేశారంటూ మంత్రి ఎదురుదాడి చేశారు. మృతదేహాన్ని ఎమ్మెల్సీ తీసుకువచ్చిన మరుక్షణం నుంచే మృతుడి కుటుంబసభ్యులు ఆందోళన చేస్తుంటే.. మంత్రి బొత్స మాత్రం వారి వల్లనే ఆలస్యం అని మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది.

ఎమ్మెల్సీ ఎక్కడున్నారో యంత్రాంగానికి తెలుసని.. కానీ ఉద్రిక్తత తగ్గిన తర్వాత అరెస్ట్ చేస్తే బెయిల్‌ రావడం కాస్త ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే వారు సహకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎలా వ్యవహరించాలన్న దానిపై ఎమ్మెల్సీకి కొందరు పోలీసు ఉన్నతాధికారులే సలహాలు ఇస్తున్నారన్న కథనాలు మీడియాలో వస్తున్నాయి. మీడియా ముందుకు వచ్చి హత్యతో తనకు సంబంధం లేదని చెప్పేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు సిద్ధమవగా.. ఒక పోలీసు ఉన్నతాధికారి.. పోస్టుమార్టం పూర్తి కాకుండా మాట్లాడితే.. వివరాల్లో పొంతన కుదరకపోతే ఇబ్బందులు వస్తాయని వారించినట్టు వార్తలొస్తున్నాయి.

హంతకుల తరపు వ్యక్తులు.. మృతుడి కుటుంబానికి భారీ మొత్తంతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ ప్రలోభాలు విజయవంతమైతే కేసు నీరు గారే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే.. అరెస్ట్ విషయంలో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News