చిక్కుల్లో శేఖర్ సినిమా

రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమా లీగల్ చిక్కుల్లో పడింది. ఈ సినిమాకు సంబంధించి కోర్టులో కేసు పడింది. ఎ.పరంధామరెడ్డి అనే ఫైనాన్షియల్.. శేఖర్ కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. పరంధామ రెడ్డి వెర్షన్ ఇది ‘శేఖర్’ సినిమా కోసం ఎ.పరంధామరెడ్డి దగ్గర, జీవిత రాజశేఖర్ 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. దాన్ని జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు హైదరాబాద్ లోని […]

Advertisement
Update:2022-05-22 12:45 IST

రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమా లీగల్ చిక్కుల్లో పడింది. ఈ సినిమాకు సంబంధించి కోర్టులో కేసు పడింది. ఎ.పరంధామరెడ్డి అనే ఫైనాన్షియల్.. శేఖర్ కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.

పరంధామ రెడ్డి వెర్షన్ ఇది
‘శేఖర్’ సినిమా కోసం ఎ.పరంధామరెడ్డి దగ్గర, జీవిత రాజశేఖర్ 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. దాన్ని జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు 48 గంటల లోగా, అంటే… ఆదివారం సాయంత్రం 4-30 గంటల్లోపు 65 లక్షల రూపాయల్ని సెక్యూరిటీ డిపాజిట్ గా జీవిత రాజశేఖర్ కోర్టులో సమర్పించాలి.

ఒకవేళ రేపటి లోగా సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వకపోతే.. ”శేఖర్” సినిమాకు సంబందించిన సర్వ హక్కులను (నెగెటివ్ రైట్) అటాచ్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే.. డిజిటల్, శాటిలైట్ తో పాటు మరే రూపంలోనూ శేఖర్ సినిమా కంటెంట్ ప్రసారం చేయకూడదన్నమాట. అటాచ్ మెంట్ అమలులోకి వస్తే, ఆదివారం సాయంత్రం తర్వాత ‘శేఖర్” సినిమాను ఏ ఫ్లాట్ ఫామ్స్ లో ఎవరు ప్రదర్శించినా కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని అంటున్నారు పరంధామరెడ్డి.

తిప్పికొట్టిన శేఖర్ నిర్మాత
అయితే ఈ ఆరోపణల్ని శేఖర్ నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఖండిస్తున్నారు. నిర్మాతగా శేఖర్ సినిమాపై పూర్తి హక్కులు తనవిగా చెప్పుకొచ్చారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకు కేవలం దర్శకురాలు మాత్రమేనని ఆయన వాదిస్తున్నారు.

”నేను శేఖర్ చిత్రానికి నిర్మాతను. జీవిత రాజశేఖర్ మా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజశేఖర్ గారు హీరోగా నటించారు. వాళ్లిద్దరి పారితోషికాలు పూర్తిగా చెల్లించాను. ఈ సినిమా రాజశేఖర్, జీవిత గార్లది అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు వాళ్ళు నష్టం కలిగిస్తే… ఏదైనా జరిగితే… నేను పరువు నష్టం దావా కేసు వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుంచి రాబడతా. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే… అసలు నిర్మాతను నేనే.”

ఇలా శేఖర్ సినిమాపై కొత్త వివాదం చెలరేగింది. నిజానికి ఈ సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద ఇచ్చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి. రెండు ఓటీటీ సంస్థలతో చర్చలు చివరి దశ వరకు వెళ్లాయి. కానీ ఆఖరి నిమిషంలో డీల్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. తాజా కేసులో ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆగిపోయింది. ఓటీటీ, శాటిలైట్ డీల్స్ కూడా ఆగిపోయాయి.

Tags:    
Advertisement

Similar News