శేఖర్ పై రాజశేఖర్ ఆవేదన

ఊహించని విధంగా శేఖర్ సినిమా నిలిచిపోవడంతో రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చేసిన సినిమా ఆగిపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. సినిమా అనేది మా ప్రాణం. […]

Advertisement
Update:2022-05-22 13:01 IST

ఊహించని విధంగా శేఖర్ సినిమా నిలిచిపోవడంతో రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చేసిన సినిమా ఆగిపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

“శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. సినిమా అనేది మా ప్రాణం. ‘శేఖర్‌’ మాకు చాలా ప్రత్యేకం. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు. ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను”

ఇలా శేఖర్ సినిమా నిలుపుదలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజశేఖర్. ఈ సినిమాకు సంబంధించి జీవిత రాజశేఖర్ తనకు 65 లక్షలు అప్పు ఉన్నారంటూ పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి శేఖర్ సినిమా ప్రసారాలు నిలిచిపోయాయి.

Tags:    
Advertisement

Similar News