ప్రేమలేఖ రాసిన రాఘవేంద్రరావు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రేమలేఖ రాశారు. ఆయన ప్రేమలేఖ రాసింది ఎవరికో కాదు, సినీ ఇండస్ట్రీకి. అవును.. తన ప్రేమలేఖలన్నింటితో ఆయనో పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకానికి నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ అనే పేరు పెట్టారు. కొంచెం తీపి.. కొంచెం కారం.. కొంచెం.. అనేది ఈ పుస్తకానికి ట్యాగ్ లైన్. ఉన్నట్టుంది ఉన్నఫలంగా దర్శకేంద్రుడు పుస్తకం రాయడానికి ఓ కారణం ఉంది. రేపటితో ఈయన 80వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ 80 ఏళ్ల జీవితంలో 48 ఏళ్ల […]

Advertisement
Update:2022-05-22 12:53 IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రేమలేఖ రాశారు. ఆయన ప్రేమలేఖ రాసింది ఎవరికో కాదు, సినీ ఇండస్ట్రీకి. అవును.. తన ప్రేమలేఖలన్నింటితో ఆయనో పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకానికి నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ అనే పేరు పెట్టారు. కొంచెం తీపి.. కొంచెం కారం.. కొంచెం.. అనేది ఈ పుస్తకానికి ట్యాగ్ లైన్.

ఉన్నట్టుంది ఉన్నఫలంగా దర్శకేంద్రుడు పుస్తకం రాయడానికి ఓ కారణం ఉంది. రేపటితో ఈయన 80వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ 80 ఏళ్ల జీవితంలో 48 ఏళ్ల అనుభవాన్ని సంపాదించారు. ఆ అనుభవాలన్నింటినీ ఇలా పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు.

“ఈ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతున్నాను. నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి ‘అబద్దాలు రాయటం అనర్ధం, నిజాలు రాయటానికి భయం, …అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు, విప్పి చెప్పలేదు, కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం…..” అంటూ తన పుస్తకం గురించి చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.

ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. అది చదివి విలువైన సూచనలు-సలహాలు అందించాలని కోరుతున్నారు రాఘవేంద్రరావు.

Tags:    
Advertisement

Similar News