ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్‌ది హత్యే.. పోస్టుమార్టం నివేదిక విడుదల..!
ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ మీదే ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. తాజాగా పోస్టుమార్టం నివేదిక బయటకువచ్చింది. సుబ్రహ్మణ్యం హత్యకు గురైనట్టు తేలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంతర్గత అవయవాలు దెబ్బతిన్నట్టు తేలింది. బాగా కొట్టడం వల్లే అతడు మృతిచెందినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే హత్యకేసు నమోదుచేసిన పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును ఏ1గా చేర్చారు. అతడిని ఏ క్షణమైనా అరెస్ట్ […]
ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ మీదే ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. తాజాగా పోస్టుమార్టం నివేదిక బయటకువచ్చింది. సుబ్రహ్మణ్యం హత్యకు గురైనట్టు తేలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంతర్గత అవయవాలు దెబ్బతిన్నట్టు తేలింది. బాగా కొట్టడం వల్లే అతడు మృతిచెందినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే హత్యకేసు నమోదుచేసిన పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును ఏ1గా చేర్చారు. అతడిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కేసు నేపథ్యమిది..
తన పుట్టినరోజు వేడుకలకోసం.. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లాడు. అనంతరం అర్ధరాత్రి 2.30 గంటలకు అతడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందించి వారికి మృతదేహాన్ని అప్పగించాడు. అయితే సుబ్రహ్మణ్యం ఒంటి మీద గాయాలుండటం.. ఎమ్మెల్సీ వ్యవహార శైలి తేడాగా ఉండటంతో కుటుంబసభ్యులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన భర్తను ఎమ్మెల్సీనే హత్య చేశారని సుబ్రహ్మణ్యం భార్య ఆరోపించారు. దీంతో ఈ హత్య మిస్టరీగా మారింది. మరోవైపు నిన్న కాకినాడలో హైడ్రామా నెలకొన్నది. ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేవరకు తాము పోస్టుమార్టం చేయనిచ్చేది లేదని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు పట్టుబట్టారు. మరోవైపు విపక్షాలు, ప్రజాసంఘాలు కూడా ఆందోళన చేశాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు ముమ్మరం చేశామని ప్రకటించారు.