బుల్లితెరపై ఫెయిలైన భీమ్లానాయక్

భారీ అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ అయితే ఎవరికైనా ఆశ్చర్యమే. రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ గా నిలిచాయి. ఈ అంచనాలు, వెండితెరపై మాత్రమే కాదు, బుల్లితెరపై కూడా ఉంటాయి. అలా భారీ అంచనాలతో బుల్లితెరపైకొచ్చిన ఓ సినిమా ఫ్లాప్ అయింది. దాని పేరు భీమ్లానాయక్. వెండితెరపై కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాను తాజాగా స్టార్ మా ఛానెల్ ప్రసారం చేసింది. పవన్ కల్యాణ్ సినిమా కాబట్టి రేటింగ్ […]

Advertisement
Update:2022-05-19 16:04 IST

భారీ అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ అయితే ఎవరికైనా ఆశ్చర్యమే. రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ గా నిలిచాయి. ఈ అంచనాలు, వెండితెరపై మాత్రమే కాదు, బుల్లితెరపై కూడా ఉంటాయి. అలా భారీ అంచనాలతో బుల్లితెరపైకొచ్చిన ఓ సినిమా ఫ్లాప్ అయింది. దాని పేరు భీమ్లానాయక్.

వెండితెరపై కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాను తాజాగా స్టార్ మా ఛానెల్ ప్రసారం చేసింది. పవన్ కల్యాణ్ సినిమా కాబట్టి రేటింగ్ కుమ్మేస్తుందని ఛానెల్ తో పాటు, అతడి అభిమానులు కూడా భావించారు. కానీ భీమ్లానాయక్ ఫెయిలైంది. తొలిసారి టీవీల్లోకొచ్చిన ఈ సినిమాకు కేవలం 9 టీఆర్పీ మాత్రమే వచ్చింది.

స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా టీవీల్లో వాటికి మినిమం రేటింగ్ ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నీ మారిపోయాయి. సాహో సినిమాకు, సైరా సినిమాకు సింగిల్ డిజిట్ లో రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి భీమ్లానాయక్ కూడా చేరిపోయింది. ఈ సినిమాకు ఎందుకు ఇంత తక్కువ రేటింగ్ వచ్చిందనే అంశంపై ప్రస్తుతం ఆ ఛానెల్ పెద్దలు చర్చల్లో మునిగిపోయారు.

ఇదేదో ఒక్క సినిమాతో పోయేది కాదు. పవన్ సినిమాకు తక్కువ రేటింగ్ రావడం అనేది, అతడి అప్ కమింగ్ సినిమాల నాన్-థియేట్రికల్ రేట్స్ పై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం పవన్ చేతిలో 4 సినిమాలున్నాయి. ఇలా తక్కువ రేటింగ్స్ వస్తే, అతడి సినిమాలకు కోట్లలో డబ్బులు పెట్టేందుకు ఛానెల్స్ ముందుకురావు.

Tags:    
Advertisement

Similar News