"ప్లీజ్.. ప్లీజ్ అంటే తంబాకు, లవంగం ఇస్తారు కానీ.. అధికారం ఇవ్వరు"

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్‌కే రెస్టారెంట్స్‌ మాజీ సీఈవో రాజీవ్ మట్ట చేసిన ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. రాజీవ్ మట్ట ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్‌… ఒకసారి ఈ విషయాలను పరిశీలించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా నడిపిస్తోందని రాజీవ్ మట్ట విమర్శించారు. అప్పుల గణాంకాలను ఆయన వివరించారు. 2014 వరకు అంటే 65 ఏళ్ల కాలంలో భారత దేశం చేసిన మొత్తం అప్పు […]

Advertisement
Update:2022-05-16 02:20 IST

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్‌కే రెస్టారెంట్స్‌ మాజీ సీఈవో రాజీవ్ మట్ట చేసిన ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. రాజీవ్ మట్ట ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్‌… ఒకసారి ఈ విషయాలను పరిశీలించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నరేంద్రమోడీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా నడిపిస్తోందని రాజీవ్ మట్ట విమర్శించారు. అప్పుల గణాంకాలను ఆయన వివరించారు. 2014 వరకు అంటే 65 ఏళ్ల కాలంలో భారత దేశం చేసిన మొత్తం అప్పు 53 లక్షల కోట్లు కాగా.. నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలోనే భారీగా అప్పులు పెంచేసిందని.. 2023 నాటికి మరో 100 లక్షల కోట్లకు అప్పు పెరిగి మొత్తం అప్పు లక్షా 53వేల కోట్లకు చేరనుందని రాజీవ్ మట్ట వివరించారు.

2020 డిసెంబర్ నాటికే దేశ మొత్తం అప్పు జీడీపీలో 73.95 శాతానికి పెరిగిందని వివరించారు. (నిజానికి అప్పుల నిష్పత్తి జీఎస్‌డీపీలో 20 శాతం దాటకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిర్దేశిస్తోంది.. కేంద్రం మాత్రం భారీగా అప్పులు పెంచుకుంటోంది.)

విదేశాల నుంచి దిగుమతులు పెరుగుతున్న వైనంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతులు పెరుగుతున్నా.. దిగుమతులూ భారీగా పెరగడం వల్ల వాణిజ్య లోటు పెరుగుతోందన్నారు. పైగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 19 లక్షల కోట్ల విదేశీ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉందని వివరించారు.

2016లో 8.26 శాతం ఉన్న జీడీపీ వృద్ధి రేటును మోడీ నోట్ల రద్దు నిర్ణయం దారుణంగా దెబ్బతీసిందని.. తగ్గుతూ వస్తూ 2019లో 4.04 శాతానికి తగ్గిందన్నారు. 2020లో మైనస్‌లోకి వెళ్లిందని గుర్తు చేశారు. ఇందుకు కేవలం కరోనాను కారణంగా చూపడం సరికాదన్నారు.

అటు కేటీఆర్‌ తన మీడియా సమావేశంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితిపై కీలకమైన వివరాలను ప్రస్తావించారు.

కేటీఆర్‌ చెబుతున్న దాని ప్రకారం..
గత ఎనిమిదేళ్లలో తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్లి సొమ్ము- రూ. 3 లక్షల 65 వేల కోట్లు. గత ఎనిమిదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన పన్నుల వాటా కేవలం- రూ. 1.68 లక్షల కోట్లు.
కేంద్రం అప్పు జీడీపీలో- 73 శాతం
తెలంగాణ అప్పు జీఎస్‌డీపీలో కేవలం- 23.5 శాతం
అప్పుల్లో దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ 23 వస్థానంలో ఉంది.
గత ఎనిమిదేళ్లలో పెట్రోల్, డిజిల్ ద్వారా మోడీ ప్రభుత్వం వసూలు చేసింది- రూ. 26.5 లక్షల కోట్లు
బడా వ్యాపారవేత్తలకు 8ఏళ్లలో మాఫీ చేసిన రుణాల మొత్తం- 11.65 లక్షల కోట్లు

కేటీఆర్ మీడియా సమావేశంలో.. ఒక డైలాగ్ బాగా పాపులర్ అవుతోంది. ఒక్కసారి బీజేపీకి చాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ బండి సంజయ్‌ విజ్ఞప్తి చేయడాన్ని ప్రస్తావించిన కేటీఆర్‌… ”ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్ అంటే తంబాకా, లవంగం ఇస్తారు కానీ.. అధికారం ఇవ్వరు” అని వ్యాఖ్యానించారు. పనిచేసే వారికే ప్రజలు అధికారం కట్టబెడుతారన్నారు.

Tags:    
Advertisement

Similar News