ఎఫ్3 పార్టీ సాంగ్ ప్రోమో అదిరింది

ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’ మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ‘ఎఫ్3’… థియేట్రికల్ ట్రైలర్ ద్వారానే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించబోతుందని అర్థమైంది. ‘ఎఫ్3’ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఎఫ్ 3 నుండి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఎఫ్ 3 థీమ్ ప్రకారం డిజైన్ చేసిన మొదటి […]

Advertisement
Update:2022-05-16 16:10 IST

ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’ మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ‘ఎఫ్3’… థియేట్రికల్ ట్రైలర్ ద్వారానే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించబోతుందని అర్థమైంది.

‘ఎఫ్3’ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఎఫ్ 3 నుండి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఎఫ్ 3 థీమ్ ప్రకారం డిజైన్ చేసిన మొదటి పాట ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. పదేపదే పాడుకునే పాట గా నిలిచింది. రెండో పాట ‘వూ.. ఆ.. ఆహా’లో తమన్నా , మెహ్రీన్ గ్లామర్ తో పాటు సోనాల్ చౌహాన్ ఎక్స్ ట్రా గ్లామర్‌ని జోడించారు.

ఇప్పుడు ఎఫ్3 గ్లామర్ ని మరింత పెంచింది పూజా హెగ్డే. ఎఫ్3 లో పూజ హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ”లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ అనే పాటతో అలరించబోతుంది పూజా హెగ్డే. రేపు ( మే 17) ఈ పాట లిరికల్ వీడియో ని విడుదల చేయనున్నారు. ఈ రోజు పాట ప్రోమో రిలీజ్ చేశారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం చేసిన ట్యూన్ అదిరిపోయింది. సూపర్ ఎనర్జిటిక్ నెంబర్ ని ఈ పార్టీ సాంగ్ కోసం ట్యూన్ చేశాడు దేవి. వెంకటేష్, వరుణ్ తేజ్, పూజా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులని అలరించాయి. ప్రోమో విడుదలైన క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

Full View

Tags:    
Advertisement

Similar News