ఎఫ్3లో ఫన్ మాత్రమే ఉండదు..!

ఎఫ్3 సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోసారి నవ్వుకోవడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇందులో కేవలం నవ్వులు మాత్రమే కాదు, మంచి సందేశం కూడా ఉందంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. “ఎఫ్2 హిట్టయిన వెంటనే మనీ కాన్సెప్ట్ లో ఎఫ్3 అనుకున్నాను. ఎందుకంటే, అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. నేను అనుకున్నప్పటికీ కరోనా స్టార్ట్ అవ్వలేదు, కరోనా వచ్చిన తర్వాత డబ్బు విలువ మరింతగా తెలిసొచ్చింది. మనీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది […]

Advertisement
Update:2022-05-16 16:21 IST

ఎఫ్3 సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోసారి నవ్వుకోవడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇందులో కేవలం నవ్వులు మాత్రమే కాదు, మంచి సందేశం కూడా ఉందంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

“ఎఫ్2 హిట్టయిన వెంటనే మనీ కాన్సెప్ట్ లో ఎఫ్3 అనుకున్నాను. ఎందుకంటే, అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. నేను అనుకున్నప్పటికీ కరోనా స్టార్ట్ అవ్వలేదు, కరోనా వచ్చిన తర్వాత డబ్బు విలువ మరింతగా తెలిసొచ్చింది. మనీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది తెలిసింది. మనిషి జీవితంలో మనీ ఎంత వరకు ఇంపార్టెంట్ అనే పాయింట్ ను జెన్యూన్ గా చెబుదాం అనిపించింది. ఎఫ్2లో ఎంత నవ్వించినా ఓ మంచి కంటెంట్ చెప్పాం. అదే విధంగా ఎఫ్3లో కూడా బాగా నవ్విస్తాం, మనీకి సంబంధించి మంచి కంటెంట్ కూడా చెబుతాం. మనిషి లైఫ్ ను మనీ ఎలా రూల్ చేస్తుందనేది వివరిస్తాం.”

ఇలా ఎఫ్3 కథపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఓవైపు లిరికల్ సాంగ్స్ విడుదలవుతుంటే, మరోవైపు యూనిట్ అంతా ఇంటర్వ్యూలతో అదరగొడుతోంది. ఈసారి స్వయంగా అనీల్ కూడా రంగంలోకి దిగాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎఫ్3 కంటెంట్ ఎలా ఉండబోతోందో వివరించాడు.

వరుణ్, వెంకటేష్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్ర పోషించింది. ఈనెల 27న థియేటర్లలోకి వస్తోంది ఎఫ్3.

Tags:    
Advertisement

Similar News