గిరిజన యువతిగా మారిన జబర్దస్త్ బ్యూటీ

జబర్దస్త్ గా కనిపించే అనసూయ, సడెన్ గా గిరిజన యువతిగా మారింది. తన తాజా చిత్రంలో ఆమె గిరిజన మహిళగా కనిపించనుంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. ఈ సినిమా పేరు వాంటెడ్ పండుగాడ్. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెలమూడి, వెంక‌ట్ కోవెలమూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే […]

Advertisement
Update:2022-05-16 16:13 IST

జబర్దస్త్ గా కనిపించే అనసూయ, సడెన్ గా గిరిజన యువతిగా మారింది. తన తాజా చిత్రంలో ఆమె గిరిజన మహిళగా కనిపించనుంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. ఈ సినిమా పేరు వాంటెడ్ పండుగాడ్.

శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెలమూడి, వెంక‌ట్ కోవెలమూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.

అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫ‌స్ట్ లుక్‌తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో గిరిజన అమ్మాయిగా అనసూయ కనిపిస్తోంది. ఆమె వస్త్రధారణ, లుక్ సరిగ్గా సరిపోయింది.

శ్రీధర్ సీపాన దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ పూర్తి చేశారు. మరో 4-5 రోజుల షెడ్యూల్ పెండింగ్ ఉంది. దాన్ని హైదరాబాద్ లో పూర్తి చేస్తారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News