కన్నకూతుర్ని అందుకే సినిమాలోకి తీసుకున్నారట

శేఖర్ సినిమాలో రాజశేఖర్ హీరో. ఇదే సినిమాలో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ కూడా నటించింది. తండ్రికూతుళ్లు నటించిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలో శివానీ ఎందుకు నటించింది. కేవలం హైప్ కోసమే ఆమెను తీసుకున్నారా? ఈ ఎంపిక వెనక కారణాన్ని బయటపెట్టారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. “రాజశేఖర్ గారు, శివాని ఇద్దరూ ఈ సినిమాలో ఉన్నా కూడా నేను కాంప్రమైజ్ కాలేదు. సీన్ వచ్చేవరకు వాళ్లతో తీస్తూనే ఉన్నాను. ఈ మూవీలో కూతురు పాత్రకు […]

Advertisement
Update:2022-05-15 13:20 IST

శేఖర్ సినిమాలో రాజశేఖర్ హీరో. ఇదే సినిమాలో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ కూడా నటించింది. తండ్రికూతుళ్లు నటించిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలో శివానీ ఎందుకు నటించింది. కేవలం హైప్ కోసమే ఆమెను తీసుకున్నారా? ఈ ఎంపిక వెనక కారణాన్ని బయటపెట్టారు దర్శకురాలు జీవిత రాజశేఖర్.

“రాజశేఖర్ గారు, శివాని ఇద్దరూ ఈ సినిమాలో ఉన్నా కూడా నేను కాంప్రమైజ్ కాలేదు. సీన్ వచ్చేవరకు వాళ్లతో తీస్తూనే ఉన్నాను. ఈ మూవీలో కూతురు పాత్రకు చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉందని ఇద్దరు కూతుళ్ళు శివాని, శివాత్మికకు చెప్పాను. ఇద్దర్లో శివానీ చేస్తానని చెప్పింది. డాటర్ రోల్ కి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొత్త అమ్మాయిను తీసుకొచ్చి వారి మధ్య డాటర్, ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే.. శివాని డాటర్ గా చేస్తే, ఆడియన్స్ కు తొందరగా రిజిస్టర్ అవుతుందని భావించాను. అందుకే శివానీతో ఆ పాత్ర చేయించాం.”

రాజశేఖర్ రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ & సెన్సిటివ్ చాలా సరదాగా ఉండే మనిషి అంటున్నారు జీవిత. అయితే కోపం వస్తే ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారని.. తన నిజజీవితంలో రాజశేఖర్ ఎలా ఉంటాడో ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉన్నారని అంటున్నారు. కామన్ మేన్ కి ప్రాబ్లం వస్తే ఏం చెప్తాడు, కోపం వస్తే ఏ చేస్తాడు అనేదే ఈ సినిమా.

Tags:    
Advertisement

Similar News