పొద్దున్న విలనీ.. రాత్రికి కామెడీ

ఎఫ్3 సినిమాతో వింటేజ్ సునీల్ ను చూస్తారని చెబుతున్నాడు సునీల్. ఒకప్పుడు తను ఎలాంటి కామెడీ చేశానో, ఆ మార్క్ కామెడీ మొత్తం ఎఫ్3లో కనిపిస్తుందని అంటున్నాడు. సినిమాలో తన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. “సినిమా అంతా నా పాత్ర ఉంటుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్ గారు […]

Advertisement
Update:2022-05-15 13:17 IST

ఎఫ్3 సినిమాతో వింటేజ్ సునీల్ ను చూస్తారని చెబుతున్నాడు సునీల్. ఒకప్పుడు తను ఎలాంటి కామెడీ చేశానో, ఆ మార్క్ కామెడీ మొత్తం ఎఫ్3లో కనిపిస్తుందని అంటున్నాడు. సినిమాలో తన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

“సినిమా అంతా నా పాత్ర ఉంటుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్ గారు , రఘుబాబు ఒక బ్యాచ్, తమన్నా ఫ్యామిలీ ఒక బ్యాచ్, పృద్వీగారు, స్టంట్ శివ ఒక బ్యాచ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక బ్యాచ్, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ గారు ఒక బ్యాచ్.. మళ్ళీ అందరం కలసి ఒక బ్యాచ్.. అందరం కలసిన తర్వాత కామెడీ మాములుగా ఉండదు. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో వుంటుంది.”

ఎఫ్ 3, పుష్ప సినిమాలు ఒకేసారి చేయాల్సి వచ్చిందంటున్న సునీల్…. విరుద్ధమైన రెండు పాత్రల్ని ఒకేసారి పోషించడం తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందన్నాడు. పొదున్న పుష్పలో విలనీ చేసి, రాత్రికి ఎఫ్3లో కామెడీ చేయాల్సి వచ్చిందని.. అది మాత్రం తనకు కష్టమైందని అన్నాడు.

Tags:    
Advertisement

Similar News