అమిత్ షాతో కేఏ పాల్ భేటీపై చర్చ

ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనకు ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడమూ చర్చనీయాంశమవుతోంది. కొద్దికాలంగా తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా కేఏ పాల్ విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య పర్యటనలో ఒక వ్యక్తి కేఏ పాల్ చెంపపై కొట్టడం కలకలం రేపింది. దాడి చేసింది టీఆర్‌ఎస్‌ వారేనని కేఏ పాల్ ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు పాల్‌ అమిత్ షాతో భేటీ అవడం, భేటీ తర్వాత కేఏ […]

Advertisement
Update:2022-05-13 02:23 IST

ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనకు ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడమూ చర్చనీయాంశమవుతోంది. కొద్దికాలంగా తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా కేఏ పాల్ విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య పర్యటనలో ఒక వ్యక్తి కేఏ పాల్ చెంపపై కొట్టడం కలకలం రేపింది. దాడి చేసింది టీఆర్‌ఎస్‌ వారేనని కేఏ పాల్ ఆరోపిస్తూ వచ్చారు.

ఇప్పుడు పాల్‌ అమిత్ షాతో భేటీ అవడం, భేటీ తర్వాత కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలను బట్టి టీఆర్‌ఎస్‌ వ్యతిరేకులకు బీజేపీ పెద్దలు అభయం ఇస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది.

భేటీ తర్వాత కేఏ పాల్.. మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎంత ధైర్యం ఉంటే తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్ కలిసి తనపై దాడి చేయిస్తారని పాల్ ప్రశ్నించారు. ఇకపై వారి ఆటలు చెల్లవన్నారు. తనపై దాడి ఫలితం ఎలా ఉంటుందో త్వరలోనే తండ్రికొడుకులు చూస్తారని హెచ్చరించారు. తనకు అమిత్ షా నుంచి భరోసా లభించిందని పాల్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 8 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని.. ఇలాగే అప్పులు చేస్తూ పోతే దేశం మరో శ్రీలంక అవుతుందని.. ఆ పరిస్థితి రాకుండా అడ్డుకోవాల్సిందిగా అమిత్ షాను కోరానన్నారు. 33 ఏళ్ల క్రితం చైనా, భారత్ జీడీపీ సమంగా ఉంటే.. ఇప్పుడు చైనా జీడీపీ మన కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉందన్నారు. కలుస్తానంటే తెలంగాణ డీజీపీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని.. కానీ అడగగానే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News