మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ కి టాప్ ప్లేస్ " కేటీఆర్..

ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ తమ రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్ లో పెట్టాలనుకోవడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సెంటర్‌ లో అమెరికాకు చెందిన ‘కాల్‌ అవే’ గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో శాండియాగోలోని క్వాల్కంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. రాయదుర్గంలో ‘కాల్‌ అవే’ అతిపెద్ద డిజిటెక్‌ కేంద్రాన్ని రూ.150కోట్లతో ఏర్పాటు చేశారు. […]

Advertisement
Update:2022-05-12 09:40 IST

ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ తమ రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్ లో పెట్టాలనుకోవడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సెంటర్‌ లో అమెరికాకు చెందిన ‘కాల్‌ అవే’ గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో శాండియాగోలోని క్వాల్కంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. రాయదుర్గంలో ‘కాల్‌ అవే’ అతిపెద్ద డిజిటెక్‌ కేంద్రాన్ని రూ.150కోట్లతో ఏర్పాటు చేశారు. దీని ద్వారా సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

యాపిల్, గూగుల్.. ఇప్పుడు కాల్ అవే..
తెలంగాణలో ఇప్పటికే ప్రముఖ డిజిటెక్ కంపెనీలన్నీ తమ రెండో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాయి. యాపిల్‌, గూగుల్‌, ఉబెర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌ లోనే ఏర్పాటు చేశాయని కేటీఆర్‌ గుర్తుచేశారు. ‘కాల్‌ అవే’ భవిష్యత్తులో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.

‘కాల్ అవే’ ప్రత్యేకతలివే..
కాల్ అవే గోల్ఫ్ ఆటలకు ప్రత్యేకం. అంతే కాదు. గోల్ఫ్‌ తోపాటు పార్టీలకు వేదికలను అద్దెకు ఇవ్వడం, స్పోర్ట్స్ బార్లు, రెస్టారెంట్లను కూడా ఈ సంస్థ నిర్వహిస్తుంటుంది. టాప్‌ గోల్ఫ్‌ కు హైదరాబాద్‌ ఎంతో అనువైన ప్రదేశమని ‘కాల్ అవే’ కార్యాలయ ప్రారంభోత్సవంలో చెప్పారు కేటీఆర్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు.. ప్రభుత్వం తరపున అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని కేటీఆర్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్‌, భారత్ లోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News