మాస్ సాంగ్ పై మహేష్ రియాక్షన్ ఇది
రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది సర్కారువారి పాట. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉంది. అది కూడా మహేష్ పేరు మీద ఉండడం విశేషం. ఆ పాట గురించి మీడియాతో మాట్లాడాడు మహేష్. చాలా గమ్మత్తుగా ఆ పాట సినిమాలోకి వచ్చి చేరిందన్నాడు. నిజానికి సినిమాలో ముందుగా ఆ పాట లేదంట. ఆఖరి నిమిషంలో పరశురామ్ పట్టుబట్టి ఆ పాట పెట్టించాడట. ఇక అంతా అయిపోయిందని రిలాక్స్ అయిన టైమ్ లో.. వచ్చి ఆ పాట […]
రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది సర్కారువారి పాట. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉంది. అది కూడా మహేష్ పేరు మీద ఉండడం విశేషం. ఆ పాట గురించి మీడియాతో మాట్లాడాడు మహేష్. చాలా గమ్మత్తుగా ఆ పాట సినిమాలోకి వచ్చి చేరిందన్నాడు.
నిజానికి సినిమాలో ముందుగా ఆ పాట లేదంట. ఆఖరి నిమిషంలో పరశురామ్ పట్టుబట్టి ఆ పాట పెట్టించాడట. ఇక అంతా అయిపోయిందని రిలాక్స్ అయిన టైమ్ లో.. వచ్చి ఆ పాట చేయమన్నారట. అప్పటికే బాగా నీరసంగా ఉన్న మహేష్.. 2 రోజుల పాటు రిహార్సల్స్ చేసి, తర్వాత మరో 2 రోజుల్లో పాటను పూర్తి చేశాడట.
“నిజానికి మొదట ఒక సాంగ్ అనుకున్నాం. సినిమా ఫ్లో చూసినప్పుడు ఆ పాట సరిగ్గా కుదరలేదని దర్శకుడు పరశురాం భావించారు. ఒక మాస్ సాంగ్ ఐతే బావుంటుందని టీం మొత్తం నిర్ణయానికి వచ్చాం. తమన్ మమా మహేష్ .. పాట ట్యూన్ వినిపించారు. చాలా ఎనర్జీటిక్ గా అనిపించింది. పది రోజుల్లో ఒక భారీ సెట్ వేసి షూట్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. సర్కారు వారి పాటలో మమ మహేష్ పాట ఒక హైలెట్ గా ఉండబోతుంది.”
ఓ మాస్ సాంగ్ కోసం, నీరసంగా ఉన్నప్పటికీ ఉత్సాహం తెచ్చుకొని డాన్స్ చేయాల్సి వచ్చిందని మహేష్ చెప్పుకొచ్చాడు. తెరపైన చూసినప్పుడు తను నీరసంగా ఉన్నాననే విషయం తనకు మాత్రమే తెలుసని, ఆడియన్స్ కు అస్సలు ఆ ఫీలింగ్ రాదన్నాడు సూపర్ స్టార్.