వానపాముల బుసలకు భయపడం.. రోజా ఫైర్..!
ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రి రోజా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘చంద్రబాబు మాటలు వింటుంటే నవ్వొస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనతో రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్టు.. చంద్రబాబు, ఓ వర్గం మీడియా మైండ్ గేమ్ మొదలుపెట్టింది. నిజానికి టీడీపీని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. క్విట్ చంద్రబాబు అన్నారు కాబట్టే ఆయన హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి మీడియాను అడ్డుపెట్టుకొని డ్రామాలు చేయాలని చూస్తున్నారు. ఆయనను ప్రజలు ఎవరూ పట్టించుకోరు. ఇక పవన్ కల్యాణ్ మాటలు కోటలు దాటుతున్నాయి. […]
ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రి రోజా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘చంద్రబాబు మాటలు వింటుంటే నవ్వొస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనతో రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్టు.. చంద్రబాబు, ఓ వర్గం మీడియా మైండ్ గేమ్ మొదలుపెట్టింది. నిజానికి టీడీపీని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. క్విట్ చంద్రబాబు అన్నారు కాబట్టే ఆయన హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి మీడియాను అడ్డుపెట్టుకొని డ్రామాలు చేయాలని చూస్తున్నారు. ఆయనను ప్రజలు ఎవరూ పట్టించుకోరు.
ఇక పవన్ కల్యాణ్ మాటలు కోటలు దాటుతున్నాయి. ఆయన సొంతంగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు.. అటువంటి వ్యక్తి ఏకంగా జగన్ ను ఓడిస్తానని ప్రగల్బాలు పలకడం ఆశ్చర్యంగా ఉంది. లోకేశ్ పరిస్థితి కూడా అంతే. ఇటువంటి వానపాముల బుసలకు మేము భయపడం. రాష్ట్రంలో టీడీపీకి అంత సీన్ లేదు.’ అని రోజా ఫైర్ అయ్యారు.
చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమైనా మేలు చేశారా? అని రోజా ప్రశ్నించారు. కరోనాతో రాష్ట్ర ఆర్థికపరిస్థితి అతలాకుతలం అయిపోతున్నా కూడా ముఖ్యమంత్రి జగన్ భయపడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సీఎం దేశంలో జగన్ ఒక్కరేనని కొనియాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు విమర్శించేందుకు ఏ అంశం దొరక్క ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీడీపీ నేత నారాయణ ఉండటం సిగ్గుచేటని పేర్కొన్నారు.