టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంలో 60 మంది అరెస్టు

పదవ తరగతి పరీక్ష పత్రం లీక్ అయిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్టు విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. పదో తరగతి పరీక్షల నిర్వహణ వైఫల్యాన్ని కప్పి పుచ్చేందుకే నారాయణను అరెస్టు చేశారని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ధ్వ‌జమెత్తారు. ఆధారాలు లేకుండా, విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండే నారాయణను అరెస్టు చేయడానికి కుట్రలు […]

Advertisement
Update:2022-05-10 11:29 IST

పదవ తరగతి పరీక్ష పత్రం లీక్ అయిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్టు విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. పదో తరగతి పరీక్షల నిర్వహణ వైఫల్యాన్ని కప్పి పుచ్చేందుకే నారాయణను అరెస్టు చేశారని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ధ్వ‌జమెత్తారు. ఆధారాలు లేకుండా, విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండే నారాయణను అరెస్టు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని బాబు ఆరోపించారు.

మరో వైపు నారాయణ అరెస్టు వ్యవహారం పై చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో నారాయణ పాత్రపై పూర్తి ఆధారాలున్నాయని రాంబాబు తెలిపారు. ప్రతీ సారీ పరీక్ష పత్రాల లీకేజీ వల్లే నారాయణ విద్యా సంస్థలకు నెంబర్ వన్ స్థానం వస్తోందని ఆయన ఆరోపించారు. వాళ్ళే లీక్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళే గందరగోళం సృష్టిస్తారని రాంబాబు అన్నారు.

కాగా, పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారంలో 60 మందిని అరెస్టు చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగానే నారాయణ అరెస్టు కూడా జరిగిందని, అన్ని ఆధారాలతోనే ఈ అరెస్టులు జరిగాయని బొత్స అన్నారు.

Tags:    
Advertisement

Similar News