వచ్చే నెలలో నయనతార పెళ్లి?

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నయనతార, విఘ్నేష్ శివన్. తమ ప్రేమను కూడా వీళ్లిద్దరూ వెల్లడించారు. ఇప్పుడీ జంట పెళ్లికి సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 9న నయన్-విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ ప్రేమజంట, భార్యాభర్తలుగా మారబోతున్నారు. రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి కేఆర్కే అనే సినిమా చేశాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తే, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్ లోనే తమ పెళ్లిపై వీరు స్పందించారు. […]

Advertisement
Update:2022-05-07 08:47 IST

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నయనతార, విఘ్నేష్ శివన్. తమ ప్రేమను కూడా వీళ్లిద్దరూ వెల్లడించారు. ఇప్పుడీ జంట పెళ్లికి సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 9న నయన్-విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ ప్రేమజంట, భార్యాభర్తలుగా మారబోతున్నారు.

రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి కేఆర్కే అనే సినిమా చేశాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తే, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్ లోనే తమ పెళ్లిపై వీరు స్పందించారు. త్వరలోనే పెళ్లి ఉంటుందని ప్రకటించారు. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే ఇప్పుడు జూన్ 9 తేదీ బయటకొచ్చింది.

వీళ్లిద్దరూ ఇదివరకే పెళ్లి చేసుకున్నారంటూ గతంలో పుకార్లు వచ్చాయి. నయనతార తన నుదుటిపై సింధూరంతో కనిపించడంతో ఈ పుకార్లు ఎక్కువయ్యాయి. అయితే అలాంటిదేం లేదని, తమకు నిశ్చితార్థం మాత్రం పూర్తయిందని నయనతార గతంలో ప్రకటించింది. ఇప్పుడీ జంట పెళ్లికి సిద్ధమైంది.

పెళ్లి కోసం నయనతార తన సినిమా షెడ్యూల్స్ అన్నింటినీ సర్దుబాటు చేసుకుంది. కేవలం ఒక రోజు మాత్రమే వీళ్ల పెళ్లి తంతు ముగుస్తుంది. అయితే రిసెప్షన్ మాత్రం 3 రోజుల పాటు పెట్టుకున్నారు. అది కూడా మాల్దీవుల్లో. ఒక్కో పరిశ్రమకు ఒక్కో రోజు కేటాయిస్తూ, దీవిలో రిసెప్షన్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు అక్కడ హనీమూన్ ఎంజాయ్ చేసి, ఇండియాకు వస్తారు.

Tags:    
Advertisement

Similar News