ఎఫ్3కి పోటీగా వస్తున్న మేజర్

ఎఫ్3 సినిమా మే 27న థియేటర్లలోకి వస్తోంది. జూన్ 3న మేజర్ సినిమా వస్తోంది. వారం రోజుల గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది? నిజమే.. ఈ రెండు సినిమాల మధ్య పోటీ లేదు. పైగా జానర్స్ కూడా వేరు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనివార్యమైంది. ఎఫ్3 సినిమా ట్రయిలర్ ను 9వ తేదీ విడుదల చేయబోతున్నారు. అదో రోజున మేజర్ […]

Advertisement
Update:2022-05-04 15:54 IST

ఎఫ్3 సినిమా మే 27న థియేటర్లలోకి వస్తోంది. జూన్ 3న మేజర్ సినిమా వస్తోంది. వారం రోజుల గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది? నిజమే.. ఈ రెండు సినిమాల మధ్య పోటీ లేదు. పైగా జానర్స్ కూడా వేరు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనివార్యమైంది.

ఎఫ్3 సినిమా ట్రయిలర్ ను 9వ తేదీ విడుదల చేయబోతున్నారు. అదో రోజున మేజర్ సినిమా ట్రయిలర్ కూడా రాబోతోంది. అంటే, ఒకే రోజు ఓ సినిమా ట్రయిలర్ నవ్వులు పూయిస్తే, అదే రోజు మరో సినిమా ట్రయిలర్ ఎమోషనల్ ఫీలింగ్ అందించబోతోందన్నమాట. ఇలా ఒకే రోజు 2 పెద్ద సినిమాల ట్రయిలర్స్ విడుదల కాబోతున్నాయి.

డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘మేజర్’ ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మే 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో ని చిత్ర యూనిట్ ప్రేక్షకులతో పంచుకుంది. మేజర్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించినట్లు వీడియో చూస్తే అర్ధమౌతుంది. రెండు భాషల్లో విడివిడిగా చూపించిన సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా వున్నాయి. వార్, ఎటాక్, యాక్షన్, రొమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు.

26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News