చిరంజీవి, సల్మాన్ కలిసి డాన్స్ చేస్తే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ కు పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న గాడ్ ఫాదర్ లో మరో ఆకర్షణ చేరింది. చిరంజీవి- సల్మాన్ ఖాన్ పై ఓ […]

Advertisement
Update:2022-05-03 11:39 IST

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ కు పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న గాడ్ ఫాదర్ లో మరో ఆకర్షణ చేరింది. చిరంజీవి- సల్మాన్ ఖాన్ పై ఓ మాస్ సాంగ్ ని షూట్ చేయబోతున్నారు. ప్రభుదేవా ఈ పాటకు కొరియోగ్రాఫర్. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో కలసిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మెగా చిత్రంలో హీరో సత్యదేవ్ కూడా పూర్తి నిడివి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది గాడ్ ఫాదర్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు

Tags:    
Advertisement

Similar News