'సొట్ట బుగ్గల'తో సిద్ధమైన రవితేజ

రవితేజ హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ‘బుల్ బుల్ తరంగ్’ పాట విడుదల చేశారు. ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ కు రెడీ చేశారు. ఈరోజు ఈద్ సందర్భంగా అందరికీ […]

Advertisement
Update:2022-05-03 11:37 IST

రవితేజ హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ‘బుల్ బుల్ తరంగ్’ పాట విడుదల చేశారు. ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ కు రెడీ చేశారు.

ఈరోజు ఈద్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. రవితేజ ఒక మసీదు ముందు నుండి నడుచుకుంటూ రావడం ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. పోస్టర్ లో రవితేజ లుక్ సూపర్ ఫిట్ గా ఉంది. ఈ చిత్రం నుండి సెకెండ్ సింగిల్ సొట్ట బుగ్గల్లో మే 7న విడుదల కానుంది. ఈ పాట అదిరిపోయే డ్యాన్సింగ్ సాంగ్ గా అలరించబోతుంది.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. క్రాక్ తర్వాత ఈ సినిమా ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News