ఆచార్య మొదటి వారాంతం వసూళ్లు

ఫ్లాప్ అనుకున్న సినిమా కాస్తా డిజాస్టర్ గా మారేలా కనిపిస్తోంది. ఆచార్య సినిమా మొదటి 3 రోజులకే చతికిలపడింది. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు ఈ సినిమాకు వసూళ్లు బాగా పడిపోయాయి. 3 రోజుల్లో ఈ సినిమాకు కేవలం 38 కోట్ల 72 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమాకు మరో 86 కోట్ల రూపాయలు రావాలి. ఓవరాల్ గా ఫైనల్ […]

Advertisement
Update:2022-05-02 15:46 IST

ఫ్లాప్ అనుకున్న సినిమా కాస్తా డిజాస్టర్ గా మారేలా కనిపిస్తోంది. ఆచార్య సినిమా మొదటి 3 రోజులకే చతికిలపడింది. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు ఈ సినిమాకు వసూళ్లు బాగా పడిపోయాయి. 3 రోజుల్లో ఈ సినిమాకు కేవలం 38 కోట్ల 72 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమాకు మరో 86 కోట్ల రూపాయలు రావాలి. ఓవరాల్ గా ఫైనల్ రన్ ముగిసేసరికి ఈ సినిమాకు 70 కోట్లకు పైగా నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ భావిస్తోంది.

ఆచార్య సినిమాకు మొదటి రోజు 29 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రెండో రోజు ఆ షేర్ విలువ కేవలం 5 కోట్లకు పడిపోయింది. ఇక మూడో రోజైన ఆదివారం ఈ సినిమాకు మరింత తక్కువగా 4 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. వర్కింగ్ డే అయిన ఈరోజు అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల ప్రభావం కూడా ఈ సినిమాపై పడింది. ఆచార్య సినిమాకు మొదటి 3 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 11.56 కోట్లు
సీడెడ్ – రూ. 5.87 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.68 కోట్లు
ఈస్ట్ – రూ. 3.18 కోట్లు
వెస్ట్ – రూ. 3.27 కోట్లు
గుంటూరు – రూ. 4.52 కోట్లు
కృష్ణా – రూ. 2.84 కోట్లు
నెల్లూరు – రూ. 2.80 కోట్లు

Tags:    
Advertisement

Similar News