ఆచార్య 2 రోజుల వసూళ్లు
భయపడినట్టే జరిగింది. ఊహలే నిజమయ్యాయి. ఆచార్య సినిమా రెండో రోజుకు పూర్తిగా పడిపోయింది. మొదటి రోజు 33 కోట్ల రూపాయల షేర్ (జీఎస్టీలతో కలిపి) రాబట్టిన ఈ సినిమా, రెండో రోజుకు 5 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇది ఎవ్వరూ ఊహించని డ్రాప్. కనీసం ట్రేడ్ కూడా ఊహించలేదంటే, ఆచార్యపై నెగెటివ్ టాక్ ప్రభావం ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు. ఉన్నంతలో ఆచార్యకు ఊరటనిచ్చే అంశాలు రెండు మాత్రమే. ఒకటి నైజాంలో ఈ సినిమా 10 […]
భయపడినట్టే జరిగింది. ఊహలే నిజమయ్యాయి. ఆచార్య సినిమా రెండో రోజుకు పూర్తిగా పడిపోయింది. మొదటి రోజు 33 కోట్ల రూపాయల షేర్ (జీఎస్టీలతో కలిపి) రాబట్టిన ఈ సినిమా, రెండో రోజుకు 5 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇది ఎవ్వరూ ఊహించని డ్రాప్. కనీసం ట్రేడ్ కూడా ఊహించలేదంటే, ఆచార్యపై నెగెటివ్ టాక్ ప్రభావం ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు.
ఉన్నంతలో ఆచార్యకు ఊరటనిచ్చే అంశాలు రెండు మాత్రమే. ఒకటి నైజాంలో ఈ సినిమా 10 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరైంది. అటు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. అంతమాత్రాన ఈ ప్రాంతాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు కాదు. నైజాంలో వరంగల్ శీను ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్నాడు. క్లోజింగ్ నాటికి అతడికి 15 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చేలా ఉందని ట్రేడ్ అంచనా వస్తోంది.
ఓవరాల్ గా చూసుకుంటే.. ఆచార్య సినిమాకు ఇంకా 90 కోట్ల రూపాయలు రావాలి. ఈ ఫ్లాప్ టాక్ తో ఆ వసూళ్లు రావడం దాదాపు అసాధ్యం. ఇక నిన్నటితో 2 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం -రూ. 10.10 కోట్లు
సీడెడ్ – రూ. 5.23 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.14 కోట్లు
ఈస్ట్ – రూ. 2.86 కోట్లు
వెస్ట్ – రూ. 3.18 కోట్లు
గుంటూరు – రూ. 4.26 కోట్లు
కృష్ణా – రూ. 2.33 కోట్లు
నెల్లూరు – రూ. 2.55 కోట్లు