సర్కారువారి పాట ట్రయిలర్ రెడీ
సర్కారువారి పాట ట్రయిలర్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 48 గంటల్లో ఈ సినిమా ట్రయిలర్ మార్కెట్ ను తాకనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకువెళ్ళడానికి పక్కా మాస్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను సిద్ధం చేసింది చిత్ర యూనిట్. భారీ […]
సర్కారువారి పాట ట్రయిలర్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 48 గంటల్లో ఈ సినిమా ట్రయిలర్ మార్కెట్ ను తాకనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకువెళ్ళడానికి పక్కా మాస్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను సిద్ధం చేసింది చిత్ర యూనిట్.
భారీ అంచనాల మధ్య ‘సర్కారు వారి పాట’ థియేట్రికల్ ట్రైలర్ మే 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో మహేష్ బాబు కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపించారు. రెండు చేతుల్లో తాళాల గుత్తులు పట్టుకొని ఒంటి కాలిపై నిల్చుని రౌడీ గ్యాంగ్ తో ఫైట్ చేస్తున్న విజువల్ ఈ పోస్టర్ లో కనిపించడం అభిమానులని అలరించింది.
పోకిరి తర్వాత మహేష్ ఆ స్థాయిలో మాస్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ఇదేనంట. ఈ చిత్రంలో మహేష్ లోని డిఫరెంట్ షేడ్స్ ను చూపించబోతున్నాడు దర్శకుడు పరశురామ్. సంగీత సంచలనం తమన్ ప్రస్తుతం ట్రైలర్ కోసం బీజీఏం స్కోర్ పని పూర్తిచేశాడు.
మరోవైపు మహేష్ బాబు, కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన మాస్ సాంగ్‌ను కూడా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ , టైటిల్ ట్రాక్ ..చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. త్వరలోనే విడుదల కానున్న నాల్గోవ పాట ‘మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ కానుంది. సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.