గని సినిమాకు కూడా భారీ రేట్లు?

తెలంగాణలో ఓ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నప్పుడు, తొలి 10 రోజులు లేదా వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అంటే దానర్థం, ప్రతి సినిమాకు పెంచుకోమని కాదు, అది మేకర్స్ ఇష్టంపైన, సినిమాకు ఉన్న క్రేజ్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఈ వెసులుబాటును చాలామంది మేకర్స్ అత్యాశకు పోయి దుర్వినియోగం చేస్తున్నట్టు అనిపిస్తోంది. మొన్నటికిమొన్న అర్జున-ఫల్గుణ సినిమా టికెట్లను భారీ రేట్లకు అమ్మారు. శ్రీవిష్ణు నటించిన చిన్న సినిమా అయినప్పటికీ, […]

Advertisement
Update:2022-04-05 02:48 IST

తెలంగాణలో ఓ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నప్పుడు, తొలి 10 రోజులు లేదా వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అంటే దానర్థం, ప్రతి సినిమాకు పెంచుకోమని కాదు, అది మేకర్స్ ఇష్టంపైన, సినిమాకు ఉన్న క్రేజ్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఈ వెసులుబాటును చాలామంది మేకర్స్ అత్యాశకు పోయి దుర్వినియోగం చేస్తున్నట్టు అనిపిస్తోంది.

మొన్నటికిమొన్న అర్జున-ఫల్గుణ సినిమా టికెట్లను భారీ రేట్లకు అమ్మారు. శ్రీవిష్ణు నటించిన చిన్న సినిమా అయినప్పటికీ, మేకర్స్ కక్కుర్తి పడ్డారు. ఓపెనింగ్స్ తోనే భారీ వసూళ్లు రాబట్టాలనుకున్నారు. దీంతో ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా రాలేదు. అలా మంచి కంటెంట్ ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఇప్పుడు గని సినిమా కూడా అదే బాటలో ఉంది.

ఈ సినిమాకు కూడా తొలి 3 రోజులు భారీ రేట్లు ఫిక్స్ చేయబోతున్నారు. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైపోయింది. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో తొలి రోజు గని టికెట్ ధర 350 రూపాయలు కూడా ఉంది. ప్రసాద్స్ లాంటి ప్రముఖ మల్టీప్లెక్సుల్లో సైతం ధర 295 రూపాయలకు చేరిపోయింది.

గనిలో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. అతడి సినిమాల మార్కెట్ ఎంత? అతడి సినిమాలకు ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయనే కనీస అంచనాకు కూడా రాకుండా రేట్లను పెంచేసి టిక్కెట్లు అమ్ముతున్నారు. దీంతో ఫుల్ డిమాండ్ ఉండాల్సిన ఉదయం 8.45 షో కూడా ఇప్పటివరకు హౌజ్ ఫుల్ కాలేదు. ఇకనైనా మేకర్స్, టికెట్ రేట్ల అంశంపై పట్టువిడుపులు ప్రదర్శిస్తే మంచిది.

Tags:    
Advertisement

Similar News