సరదాగా సాగిన ఆర్ఆర్ఆర్ పార్టీ

ఓ సినిమా సక్సెస్ అయినప్పుడు పార్టీ చేసుకోవడం సహజం. అలాంటిదే ఓ పార్టీ రాత్రి జరిగింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ అది. అది కూడా టీమ్ చేసుకున్న పార్టీ కాదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇచ్చిన పార్టీ. అవును.. ఆర్ఆర్ఆర్ టీమ్ కోసం నిర్మాత దిల్ రాజు పార్టీ ఇచ్చారు. రాత్రి గ్రాండ్ గా జరిగిన ఈ పార్టీలో అంతా సరదాగా ఛిల్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కు చెందిన రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ తో […]

Advertisement
Update:2022-04-05 02:37 IST

ఓ సినిమా సక్సెస్ అయినప్పుడు పార్టీ చేసుకోవడం సహజం. అలాంటిదే ఓ పార్టీ రాత్రి జరిగింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ అది. అది కూడా టీమ్ చేసుకున్న పార్టీ కాదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇచ్చిన పార్టీ. అవును.. ఆర్ఆర్ఆర్ టీమ్ కోసం నిర్మాత దిల్ రాజు పార్టీ ఇచ్చారు. రాత్రి గ్రాండ్ గా జరిగిన ఈ పార్టీలో అంతా సరదాగా ఛిల్ అయ్యారు.

ఆర్ఆర్ఆర్ టీమ్ కు చెందిన రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ తో పాటు.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. సూపర్ హిట్ సాంగ్ నాటునాటు పాటకు దర్శకుడు రాజమౌళి, మరో దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి డాన్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. దర్శకులు ఇద్దర్నీ చరణ్-ఎన్టీఆర్ కలిసి డైరక్ట్ చేయడం ఇంకా ఆకట్టుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు దక్కించుకున్నారు. మరికొంతమంది పార్టనర్స్ తో కలిసి నైజాంలో భారీ ఎత్తున విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ సందర్భంగా యూనిట్ కు పార్టీ ఇచ్చాడు దిల్ రాజు.

ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ సినిమా నైజాంతో పాటు నెల్లూరు, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయింది. ఈరోజు వెస్ట్, గుంటూరులో బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. ట్రేడ్ అంచనా ప్రకారం.. ఈ వీకెండ్ నాటికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, బయ్యర్లకు లాభాలు అందించేలా ఉంది.

Tags:    
Advertisement

Similar News