కొత్త సినిమా లాంఛ్ చేసిన నితిన్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సినిమా మరో సినిమా లాంఛ్ చేశాడు. ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న వక్కంతం వంశీ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తన సొంత బ్యానర్ పై నితిన్ ఈ సినిమా చేయబోతున్నాడు. కథా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య సినిమా చేశాడు. అది ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేకపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు నితిన్ […]

Advertisement
Update:2022-04-03 12:25 IST

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సినిమా మరో సినిమా లాంఛ్ చేశాడు. ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న వక్కంతం వంశీ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తన సొంత బ్యానర్ పై నితిన్ ఈ సినిమా చేయబోతున్నాడు.

కథా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య సినిమా చేశాడు. అది ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేకపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు నితిన్ హీరోగా దర్శకుడిగా తన రెండో సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈసారి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా వస్తుందంటున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో హ్యాపెనింగ్ బ్యూటీగా కొనసాగుతున్న శ్రీలీల (పెళ్లిసందD ఫేమ్) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఓపెనింగ్ కు ఆమె కూడా వచ్చింది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత కోలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు నితిన్. ఇది పూర్తయిన వెంటనే వక్కంతం వంశీ సినిమా సెట్స్ పైకి వస్తుంది. అతడు చేయాల్సిన పవర్ పేట సినిమా ఆగిపోయింది. ఆ స్థానంలో వక్కంతం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్.

Tags:    
Advertisement

Similar News