రణబీర్ సరసన రష్మిక

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక, మరోసారి బాలీవుడ్ కే ఫిక్స్ అయింది. ఇప్పటికే 2 హిందీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ముచ్చటగా మూడో బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన కావడం విశేషం. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా చేయబోతున్నాడు రణబీర్ కపూర్. ఈ సినిమా నుంచి పరిణీతి చోప్రా తప్పుకుంది. ఆ వెంటనే రష్మికను […]

Advertisement
Update:2022-04-02 12:30 IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక, మరోసారి బాలీవుడ్ కే ఫిక్స్ అయింది. ఇప్పటికే 2 హిందీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ముచ్చటగా మూడో బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన కావడం విశేషం.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా చేయబోతున్నాడు రణబీర్ కపూర్. ఈ సినిమా నుంచి పరిణీతి చోప్రా తప్పుకుంది. ఆ వెంటనే రష్మికను లాక్ చేశారు. ఈరోజు ఉగాది సందర్భంగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు దర్శకుడు.

బాలీవుడ్ లో ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాలు చేస్తోంది రష్మిక. అవి దాదాపు ఓ కొలిక్కి వచ్చేశాయి. అంతలోనే రణబీర్ కపూర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. నిజానికి ఈ సినిమాలో ఆమె నటించడం లేదని, కేవలం పుకార్లు అంటూ నిన్నటివరకు ప్రచారం జరిగింది. కానీ అవి పుకార్లు కావని ఈరోజు తేలిపోయింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో ఆమె నటించిన పుష్ప సినిమా పెద్ద హిట్టయింది. ఆ వెంటనే వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. త్వరలోనే ఆమె పుష్ప-2 సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags:    
Advertisement

Similar News