రవితేజ సరసన కృతి సనన్ చెల్లెలు

రవితేజ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఈ చిత్రం రవితేజ కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్‌ తో భారీ స్థాయిలో రాబోతోంది. ఇప్పుడీ సినిమాలో రవితేజ సరసన నటించే హీరోయిన్లను ఫిక్స్ చేశారు. ఓ హీరోయిన్ గా ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గెలిచిన గాయత్రి భరధ్వాజ్ ను తీసుకున్నారు. ఇక మరో హీరోయిన్ గా కృతి సనన్ చెల్లెలు నూపూర్ సనన్ […]

Advertisement
Update:2022-04-02 12:14 IST

రవితేజ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఈ చిత్రం రవితేజ కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్‌ తో భారీ స్థాయిలో రాబోతోంది.

ఇప్పుడీ సినిమాలో రవితేజ సరసన నటించే హీరోయిన్లను ఫిక్స్ చేశారు. ఓ హీరోయిన్ గా ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గెలిచిన గాయత్రి భరధ్వాజ్ ను తీసుకున్నారు. ఇక మరో హీరోయిన్ గా కృతి సనన్ చెల్లెలు నూపూర్ సనన్ ఎంపిక చేశారు. తెలుగులో 1-నేనొక్కడినే సినిమా చేసింది కృతి. ఇప్పుడు రవితేజ సినిమాతో ఆమె చెల్లెలు ఇండస్ట్రీకి పరిచయమౌతోంది. గతంలో అక్షయ్ కుమార్‌ తో కలిసి మ్యూజిక్ వీడియోలో కనిపించిన నూపూర్‌ కి ర‌వితేజతో చేస్తున్న‌ మొదటి చిత్రం ఇదే కావ‌డం విశేషం.

మాదాపూర్‌లోని నోవాటెల్‌ లో ఉగాది సందర్భంగా ఈరోజు టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా ప్రీ లుక్‌ని కూడా విడుదల చేశారు.

స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన గజదొంగ నాగేశ్వరరావు. అతడ్ని అంతా టైగర్ నాగేశ్వరరావు అనేవారు. ఓ గజదొంగ, ప్రజల దృష్టిలో హీరో ఎలా అయ్యాడనే కాన్సెప్ట్ తో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ ఇందులో పూర్తిగా మాస్ లుక్‌ లో కనిపిస్తాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రాబోతోంది టైగర్ నాగేశ్వరరావు.

Full View

Tags:    
Advertisement

Similar News