చిన్న సినిమాకు మెగా గ్యారెంటీ
ఓ చిన్న సినిమాకు పెద్ద సపోర్ట్ దక్కింది. ఆ సినిమా పేరు మిషన్ ఇంపాజిబుల్ కాగా, ఆ పెద్ద సపోర్ట్ పేరు మెగాస్టార్ చిరంజీవి. అవును.. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సూపర్ గా ఉందంటున్నారు చిరంజీవి. సినిమా కచ్చితంగా అందరూ చూడాలని, తనది గ్యారెంటీ అని చెబుతున్నారు. “మిషన్ ఇంపాజిబుల్ అనేది చిన్న సినిమా కాదు. పెద్ద మనసుతో చూడతగ్గ సినిమా. ఇందులో చక్కటి ఆర్ట్ వుంది. మనసును రంజింపచేస్తుందని నేను హామీ ఇస్తున్నా. ఆర్.ఆర్.ఆర్. సినిమాకు […]
ఓ చిన్న సినిమాకు పెద్ద సపోర్ట్ దక్కింది. ఆ సినిమా పేరు మిషన్ ఇంపాజిబుల్ కాగా, ఆ పెద్ద సపోర్ట్ పేరు మెగాస్టార్ చిరంజీవి. అవును.. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సూపర్ గా ఉందంటున్నారు చిరంజీవి. సినిమా కచ్చితంగా అందరూ చూడాలని, తనది గ్యారెంటీ అని చెబుతున్నారు.
“మిషన్ ఇంపాజిబుల్ అనేది చిన్న సినిమా కాదు. పెద్ద మనసుతో చూడతగ్గ సినిమా. ఇందులో చక్కటి ఆర్ట్ వుంది. మనసును రంజింపచేస్తుందని నేను హామీ ఇస్తున్నా. ఆర్.ఆర్.ఆర్. సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఇలాంటి సినిమాకు కావాలి. ఇలాంటి చిన్న సినిమాను ఆదరిస్తే యంగ్ టాలెంట్ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఏప్రిల్ 1న మీరంతా మాకు ఇచ్చే గిఫ్ట్ మిషన్ ఇంపాజిబుల్”
ఇలా మిషన్ ఇంపాజిబుల్ అనే చిన్న సినిమాకు పెద్ద ఎలివేషన్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో చాలా గ్రాండ్ గా మాట్లాడారు. తాప్సి మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది.