వెంటిలేటర్ పై శ్రీలంక..
ఆర్థికంగా చితికిపోయిన శ్రీలంకలో ప్రజలు నిత్యావసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే శ్రీలంకను ఇప్పుడు వైద్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. అత్యవసర మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు శ్రీలంక వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్లు ఆగిపోతున్నాయ్.. అత్యవసర మందులు లేకపోవడం, కనీసం అనస్తీషియా ఇవ్వడానికి కూడా మందులు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లు ఆగిపోతున్నాయి. అత్యవసర ఆపరేషన్లు కూడా చేయలేని పరిస్థితి. దీంతో వైద్య సదుపాయాలు లేక రోగులు […]
ఆర్థికంగా చితికిపోయిన శ్రీలంకలో ప్రజలు నిత్యావసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే శ్రీలంకను ఇప్పుడు వైద్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. అత్యవసర మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు శ్రీలంక వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతోంది.
ఆపరేషన్లు ఆగిపోతున్నాయ్..
అత్యవసర మందులు లేకపోవడం, కనీసం అనస్తీషియా ఇవ్వడానికి కూడా మందులు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లు ఆగిపోతున్నాయి. అత్యవసర ఆపరేషన్లు కూడా చేయలేని పరిస్థితి. దీంతో వైద్య సదుపాయాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ చేసే మందుల్ని ఆపేశారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో ఔషధాల ధరలు నాలుగింతలు పెరిగాయి. డబ్బున్నోళ్లకే నిత్యావసరాలు అందుతున్నాయి, డబ్బున్నోళ్లకే వైద్య సదుపాయాలు అందుతున్నాయి.
భారత విదేశాంగ మంత్రి స్పందన..
శ్రీలంక దుర్భర పరిస్థితులపై అక్కడి జర్నలిస్ట్ ల ట్వీట్లకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు. శ్రీలంకలోని పరిస్థితులు కలచి వేసేలా ఉన్నాయని, శ్రీలంకలోని భారత హై కమిషనర్ గోపాల్ బాగ్లేని కలసి భారత్ నుంచి ఎలాంటి సహాయం కావాలో చెప్పాలని మంత్రి వారికి సూచించారు. శ్రీలంకకు ఇప్పటికే భారత్ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అక్కడ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది. తాజాగా శ్రీలంకకు అత్యవసర వైద్య పరికరాలు, మందులు పంపించేందుకు సిద్ధమవుతోంది.