వరుణ్ తేజ్ సినిమాకు అల్లు అర్జున్ ప్రచారం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనెస్సెన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. టీజర్, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో.. అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ […]

Advertisement
Update:2022-03-29 14:53 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనెస్సెన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.

టీజర్, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో.. అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో ఏప్రిల్ 2న జరగనుంది. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

Tags:    
Advertisement

Similar News