ఆర్ఆర్ఆర్ కు రూ.500 కోట్లు వసూళ్లు

3 రోజులు.. 500 కోట్లు.. ఆర్ఆర్ఆర్ సాధించిన ఘనత ఇది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ముదులుపుతోంది. అటు ఓవర్సీస్ లో కూడా దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమాకు 3 రోజుల్లో 500 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. గడిచిన 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యథిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించి హాలీవుడ్ మీడియా కూడా ఆర్ఆర్ఆర్ పై కథనాలు […]

Advertisement
Update:2022-03-28 14:36 IST

3 రోజులు.. 500 కోట్లు.. ఆర్ఆర్ఆర్ సాధించిన ఘనత ఇది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ముదులుపుతోంది. అటు ఓవర్సీస్ లో కూడా దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమాకు 3 రోజుల్లో 500 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

గడిచిన 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యథిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించి హాలీవుడ్ మీడియా కూడా ఆర్ఆర్ఆర్ పై కథనాలు ఇస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఇప్పటివరకు 9.4 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఆల్ టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్ లో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది ఆర్ఆర్ఆర్.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే డే-1 కలెక్షన్లలో పాత రికార్డులన్నింటినీ (బాహుబలి-2తో పాటు) తుడిచిపెట్టిన ఈ సినిమా, ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికి మరిన్ని కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ 3 రోజుల్లో ఏపీ, నైజాం నుంచి ఆర్ఆర్ఆర్ కు ఏకంగా 135 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

నార్త్ బెల్ట్ లో మాత్రం ఆర్ఆర్ఆర్ కు బాహుబలి-2 స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. అయితే మొదటి రోజు కంటే మూడో రోజుకు ఆక్యుపెన్సీ పెరగడం చెప్పుకోదగ్గ విశేషం. నార్త్ లో కూడా సినిమాకు భారీ వసూళ్లు వస్తే, బాహుబలి-2 రికార్డ్ ను ఇది కొల్లగొట్టడం ఖాయం. అటు ఓవర్సీస్ లో బాహుబలి-2ను క్రాస్ చేయాలంటే ఈ సినిమా 20 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News