ఓవర్సీస్ లో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాలు

ఆర్ఆర్ఆర్ రాకతో ఓవర్సీస్ లో రికార్డులన్నీ చెల్లాచెదురవుతున్నాయి. ఇన్నాళ్లూ హయ్యస్ట్ గ్రాసర్స్ గా చెప్పుకున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రంగస్థలం, భరత్ అనే నేను లాంటి సినిమాలు వారాల పాటు ఆడి ఓవర్సీస్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ జాబితాలోకి ఎక్కితే.. ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజు వసూళ్లకే ఈ లిస్ట్ లోకి ఎక్కేసింది. యూఎస్ లో మొదటి రోజే ప్రీమియర్స్ తో కలుపుకొని 5 మిలియన్ డాలర్లు ఆర్జించింది ఆర్ఆర్ఆర్. ఇదో పెద్ద రికార్డ్. […]

Advertisement
Update:2022-03-27 13:09 IST

ఆర్ఆర్ఆర్ రాకతో ఓవర్సీస్ లో రికార్డులన్నీ చెల్లాచెదురవుతున్నాయి. ఇన్నాళ్లూ హయ్యస్ట్ గ్రాసర్స్ గా చెప్పుకున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రంగస్థలం, భరత్ అనే నేను లాంటి సినిమాలు వారాల పాటు ఆడి ఓవర్సీస్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ జాబితాలోకి ఎక్కితే.. ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజు వసూళ్లకే ఈ లిస్ట్ లోకి ఎక్కేసింది.

యూఎస్ లో మొదటి రోజే ప్రీమియర్స్ తో కలుపుకొని 5 మిలియన్ డాలర్లు ఆర్జించింది ఆర్ఆర్ఆర్. ఇదో పెద్ద రికార్డ్. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా సాధించని ఘనత ఇది. ఆ తర్వాత రెండో రోజుకు మరో 2 మిలియన్ డాలర్లు సాధించింది. అలా 2 రోజులకే (ప్రీమియర్స్ తో కలుపుకొని) 7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి యూఎస్ఏలో అత్యథిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా 7 మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి-1ను క్రాస్ చేసి రెండో స్థానంలో నిలిచింది. దీని టార్గెట్ ఇప్పుడు బాహుబలి-2 మాత్రమే. 20 మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి-2 అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సినిమా రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేస్తుందా అనేది ఇప్పుడు అందరి అనుమానం.

ఓవర్సీస్ లో బాహుబలి-2 సినిమా అన్ని భాషల్లో హిట్టయింది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాకుండా.. హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో పెద్ద హిట్టయింది. అందుకే 20 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. అటు మలయాళం వెర్షన్ కు కూడా యూఎస్ లో డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో, ఇది టాప్-1కు చేరుకుంటుందా అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఓవర్సీస్ లో అత్యథిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా జాబితా ఇలా ఉంది..
బాహుబలి 2 – $20,571,695 ($20 million)
ఆర్ఆర్ఆర్ – $7 million* (2 రోజులకే ఆల్ టైమ్ జాబితాలో రెండో స్థానం)
బాహుబలి 1 – $6,861,819 ($6.9 million)
అల వైకుంఠపురములో – $3,635,809
రంగస్థలం – $3,513,450
భరత్ అనే నేను – $3,416,451
సాహో – $3,233,611
శ్రీమంతుడు – $2,883,437
సైరా – $2,608,115
మహానటి – $2,543,515
పుష్ప – $2,478,144

Tags:    
Advertisement

Similar News