చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ అప్ డేట్స్

ఓవైపు బయట కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ, మరోవైపు తన సినిమాల షూటింగ్స్ మాత్రం ఆపడం లేదు చిరంజీవి. ఒకేసారి 2 సినిమాలు కంప్లీట్ చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవికి సంబంధించి 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తూనే, మరోవైపు బాబి దర్శకత్వంలో సినిమాను పూర్తి చేస్తున్నారు. మొన్నటివరకు ముంబయిలో ఉన్నారు చిరంజీవి. సల్మాన్ ఖాన్ తో కలిసి గాడ్ ఫాదర్ సినిమా షూట్ లో పాల్గొన్నారు. […]

Advertisement
Update:2022-03-27 13:12 IST
చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ అప్ డేట్స్
  • whatsapp icon

ఓవైపు బయట కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ, మరోవైపు తన సినిమాల షూటింగ్స్ మాత్రం ఆపడం లేదు చిరంజీవి. ఒకేసారి 2 సినిమాలు కంప్లీట్ చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవికి సంబంధించి 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తూనే, మరోవైపు బాబి దర్శకత్వంలో సినిమాను పూర్తి చేస్తున్నారు.

మొన్నటివరకు ముంబయిలో ఉన్నారు చిరంజీవి. సల్మాన్ ఖాన్ తో కలిసి గాడ్ ఫాదర్ సినిమా షూట్ లో పాల్గొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో బాబి సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిరంజీవిపై ఓ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో శ్రుతిహాసన్‌ కి ఇది తొలి కాంబినేష‌న్ కావ‌డం విశేషం. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి కె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం పనిచేస్తోంది.

మెగా154 ప్రాజెక్టుకు రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌ గా నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా ఎఎస్‌ ప్రకాష్‌ పని చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

Tags:    
Advertisement

Similar News