తమన్న ఫుల్ వీడియో రిలీజైంది

హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అడపాదడపా ఐటెంసాంగ్స్ చేస్తుంది తమన్న. వీటికి ఓటీటీ అదనం. ఇలా బిజీబిజీగా గడిపేస్తున్న మిల్కీబ్యూటీ, తాజాగా గని సినిమాలో ఓ ఐటెంసాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కొడితే అనే లిరిక్స్ తో సాగే ఈ లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడా రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఏకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి […]

Advertisement
Update:2022-03-24 10:57 IST

హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అడపాదడపా ఐటెంసాంగ్స్ చేస్తుంది తమన్న. వీటికి ఓటీటీ అదనం. ఇలా బిజీబిజీగా గడిపేస్తున్న మిల్కీబ్యూటీ, తాజాగా గని సినిమాలో ఓ ఐటెంసాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కొడితే అనే లిరిక్స్ తో సాగే ఈ లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడా రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఏకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు వీడియో సాంగ్ వచ్చింది. తమన్నా అందచందాలు పాటకు అదనపు ఆకర్షణ. తన ఇమేజ్ కు న్యాయం చేస్తూ, మిల్కీబ్యూటీ ఈ సాంగ్ లో అదరగొట్టేసింది. ఓవైపు తన అందాలు, మరోవైపు స్టెప్పులు.. ఇలా కుర్రకారుకు ఫుల్ మీల్స్ అందించింది.

ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఏప్రిల్ 8న సినిమా విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

Tags:    
Advertisement

Similar News