కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డిగా మారిన నితిన్
నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. కేథరిన్ త్రెసా, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా […]
నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. కేథరిన్ త్రెసా, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేసారు.
ఈ సందర్భంగా, 'మాచర్ల నియోజకవర్గం' ఫస్ట్ ఛార్జ్ పేరుతో ఫస్ట్ లుక్ కి సంబంధించిన అప్‌డేట్ తో మేకర్స్ ముందుకు వచ్చారు. వినూత్నం గా మార్చి 26న ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు శైలిలో ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాలో గుంటూరు కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు నితిన్.
రాజకీయ నేపథ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్ లో కనిపించనున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.