ఆర్ఆర్ఆర్ లో యుగళగీతం ఉందా?
తెలుగు సినిమా అన్న తర్వాత డ్యూయట్ కామన్. అసలు డ్యూయట్ లేని కమర్షియల్ సినిమాను ఊహించుకోవడం కష్టం. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన బాహుబలిలో కూడా డ్యూయట్ ఉంది. అయితే భారీ ఎత్తున తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో మాత్రం యుగళగీతం లేదు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి కన్ ఫర్మ్ చేశాడు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకే ప్రేక్షకులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో లీనమైపోతారట. ఇక అప్పట్నుంచి వాళ్ల స్నేహ బంధం, […]
తెలుగు సినిమా అన్న తర్వాత డ్యూయట్ కామన్. అసలు డ్యూయట్ లేని కమర్షియల్ సినిమాను ఊహించుకోవడం కష్టం. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన బాహుబలిలో కూడా డ్యూయట్ ఉంది. అయితే భారీ ఎత్తున తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో మాత్రం యుగళగీతం లేదు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి కన్ ఫర్మ్ చేశాడు.
సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకే ప్రేక్షకులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో లీనమైపోతారట. ఇక అప్పట్నుంచి వాళ్ల స్నేహ బంధం, ఎమోషన్స్ మాత్రమే కనిపిస్తాయని, ఎక్కడా యుగళగీతాలు ఉండవని జక్కన్న స్పష్టంచేశాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ భార్య సీతగా అలియా భట్ నటించింది. వీరి మధ్య ఓ చిన్నపాటి రొమాంటిక్ ఎపిసోడ్ ఉంటుంది. అంతే తప్ప డ్యూయట్స్ లాంటివేం ఉండవంటున్నాడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ నటించిన “ఎత్తర జెండా” పాట రోలింగ్ టైటిల్స్ (సినిమా ముగింపు) సమయంలో వస్తుందని క్లారిటీ ఇచ్చాడు.
అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్న వైరల్ అయిన “నాటు నాటు” పాటలో కూడా హీరోయిన్లు కనిపించరని జక్కన్న తేల్చేశాడు. ఈపాట సినిమా ఫస్టాఫ్ లో వస్తుందని తెలిపాడు.