ఎన్టీఆర్, తారక్ పై సుమ పంచ్ లు

ఎంత పెద్ద సినిమాకైనా ప్రమోషన్స్ లో సుమ ఉంటేనే కిక్కు. ఆమె లేకపోతే ప్రమోషన్ పరిసమాప్తం అయినట్టు కాదు. ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఇన్నాళ్లూ సుమ లేకుండా, అన్నీ తానై ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లిన రాజమౌళి, ఆఖరి నిమిషంలో ఆమెను రంగంలోకి దించాడు. ఇన్నాళ్లూ చేసిన ప్రచారం ఒకెత్తయితే, సుమ చేసిన ఇంటర్వ్యూ మరో ఎత్తు అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ ప్రచారంలో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది సుమ. అయితే […]

Advertisement
Update:2022-03-22 15:44 IST

ఎంత పెద్ద సినిమాకైనా ప్రమోషన్స్ లో సుమ ఉంటేనే కిక్కు. ఆమె లేకపోతే ప్రమోషన్ పరిసమాప్తం అయినట్టు కాదు. ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఇన్నాళ్లూ సుమ లేకుండా, అన్నీ తానై ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లిన రాజమౌళి, ఆఖరి నిమిషంలో ఆమెను రంగంలోకి దించాడు. ఇన్నాళ్లూ చేసిన ప్రచారం ఒకెత్తయితే, సుమ చేసిన ఇంటర్వ్యూ మరో ఎత్తు అని చెప్పాలి.

ఆర్ఆర్ఆర్ ప్రచారంలో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది సుమ. అయితే రెగ్యులర్ యాంకర్లలా కాకుండా తన మార్క్ చూపించింది. ఆర్ఆర్ఆర్ సినిమాపై ఇన్నాళ్లూ వైరల్ గా మారిన మీమ్స్ అన్నింటినీ ముగ్గురికీ చూపిస్తూ ఇంటర్వ్యూ చేసింది. దీంతో ఇంటర్వ్యూ మొత్తం నవ్వులే నవ్వులు.

ఇన్నాళ్లూ సీరియస్ సాగిన ఆర్ఆర్ఆర్ ప్రచారాన్ని ఒక్కసారిగా స్మూత్ గా, లైట్ గా, లవ్లీగా మార్చేసింది సుమ. ఆమె చూపించిన మీమ్స్ చూసి చరణ్-తారక్ ఒకటే నవ్వులు. నిజానికి ఆ మీమ్స్ లో వాళ్లపై సెటైర్లు ఉన్నాయి. ఒకరిపై ఒకరు జోకులేసుకునే కార్టూన్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ జక్కన్న, చెర్రీ, ఎన్టీఆర్ మనసారా నవ్వుకున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు వారణాసిలోని కాశీవిశ్వేశ్వరుడ్ని దర్శించుకున్నారు ఆ ముగ్గురు. రేపు హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేశారు. రేపటితో ఆర్ఆర్ఆర్ ప్రచారం ముగుస్తుంది. 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News