10 రోజుల్లో రూ. 400 కోట్లు

భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద చిత్రాలలో రాధే శ్యామ్ ఒకటి. అద్భుతమైన లొకేషన్లు, గ్రిప్పింగ్ స్టోరీ లైన్, ప్రభాస్-పూజా హెగ్డే కెమిస్ట్రీ ఈ సినిమాలో మేజిక్ చేశాయి. ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల ద్వారా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో 200 కోట్లు ఆర్జించింది. అలా మొత్తంగా 10 రోజుల్లో […]

Advertisement
Update:2022-03-22 15:32 IST

భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద చిత్రాలలో రాధే శ్యామ్ ఒకటి. అద్భుతమైన లొకేషన్లు, గ్రిప్పింగ్ స్టోరీ లైన్, ప్రభాస్-పూజా హెగ్డే కెమిస్ట్రీ ఈ సినిమాలో మేజిక్ చేశాయి. ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల ద్వారా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో 200 కోట్లు ఆర్జించింది. అలా మొత్తంగా 10 రోజుల్లో 400 కోట్లు కలెక్ట్ చేసింది రాధేశ్యామ్.

సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా.. శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్‌ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. దీంతో నిర్మాతలకు భారీగా డబ్బులొచ్చాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకోగా.. జీ తెలుగు సంస్థ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది.

లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తన వాయిస్ ఓవర్ తో ఈ సినిమాకు ఓ కొత్త అందం తీసుకొచ్చాడు. టాప్ నాచ్ స్పెషల్ ఎఫెక్ట్స్, ఇటలీ, జార్జియాలోని అద్భుతమైన లొకేషన్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ సినిమాలో హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించాడు ప్రభాస్. పూజా హెగ్డే డాక్టర్ గా నటించింది.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఆర్ఆర్ఆర్ రాకతో ఈ సినిమా రన్ ముగిసే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News