సరికొత్త రికార్డ్ సృష్టించిన కళావతి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `సర్కారువారి పాట`లోని `కళావతి` పాట సూపర్ హిట్టయింది. విడుదలైన కొద్దిసేపటికే అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి శ్రోతల హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఈ బ్లాక్ బస్టర్ పాట ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్ లతో 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. మహేష్‌బాబు కెరీర్‌లోనే ఈ మైలురాయిని ఫాస్ట్ గా చేరుకున్న మొదటి సింగిల్‌గా నిలిచింది `కళావతి`. తమన్ అద్భుతమైన ఆర్కెస్ట్రా తో చక్కటి ఫీల్‌ను కలిగించేలా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారువారి పాట'లోని 'కళావతి' పాట సూపర్ హిట్టయింది. విడుదలైన కొద్దిసేపటికే అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి శ్రోతల హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఈ బ్లాక్ బస్టర్ పాట ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్ లతో 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. మహేష్‌బాబు కెరీర్‌లోనే ఈ మైలురాయిని ఫాస్ట్ గా చేరుకున్న మొదటి సింగిల్‌గా నిలిచింది 'కళావతి'.
తమన్ అద్భుతమైన ఆర్కెస్ట్రా తో చక్కటి ఫీల్‌ను కలిగించేలా బాణీలు సమకూర్చాడు. సిద్ శ్రీరామ్ తన మధురమైన గానంతో పాటకు ప్రాణం పోశాడు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం సమకూర్చారు. మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్, ఆకట్టుకునే హావభావాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు, కీర్తి సురేష్ ఇందులో చాలా అందంగా కనిపించింది.
ఈ చిత్రం నుంచి వచ్చిన రెండవ సింగిల్ 'పెన్నీ' కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. సితార ఘట్టమనేని డాన్స్ చేసిన ఈ పాట వైరల్‌గా మారింది. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ అందించారు. మొదటి రెండు పాటలు విజయం సాధించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సర్కారు వారి పాట మే 12న వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతోంది.