గాడ్ ఫాదర్ షూటింగ్ అప్ డేట్స్

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవ‌లే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. గాడ్ ఫాదర్ లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు స‌ల్మాన్. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ఇదే తొలిసారి. ఇలా మెగాస్టార్ […]

Advertisement
Update:2022-03-22 15:34 IST

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవ‌లే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. గాడ్ ఫాదర్ లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు స‌ల్మాన్.

చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ఇదే తొలిసారి. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకేచోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే. తాజాగా 'గాడ్ ఫాదర్' ముంబై షెడ్యూల్ పూర్త‌యింది. త‌దుప‌రి షెడ్యూల్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

సల్మాన్ తో షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా.. నిర్మాత‌లు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ముంబై సెట్లో చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇందులో ద‌ర్శ‌కుడు మోహన్ రాజా కూడా వున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News