పెన్నీ సాంగ్.. సితార, తమన్ స్టెప్పులు

సర్కారువారి పాట సినిమా నుంచి సెకెండ్ సింగిల్ వచ్చేసింది. తమన్ కంపోజిషన్ లో వచ్చిన ఈ లిరికల్ వీడియోలో ఈసారి పెద్ద హైలెట్ ఏంటంటే.. సితార్ ఎప్పీయరెన్స్. అవును.. మహేష్ బాబు నటించిన సినిమాలో ఓ పాటకు సితార డాన్స్ చేసింది. అందుకే దీన్ని లిరికల్ వీడియో అనకుండా మ్యూజిక్ వీడియో అన్నారు. పెన్నీ అనే లిరిక్స్ తో అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా.. నకాష్ అజీజ్ ఆలపించాడు. టాలీవుడ్ లో […]

Advertisement
Update:2022-03-20 12:40 IST

సర్కారువారి పాట సినిమా నుంచి సెకెండ్ సింగిల్ వచ్చేసింది. తమన్ కంపోజిషన్ లో వచ్చిన ఈ లిరికల్ వీడియోలో ఈసారి పెద్ద హైలెట్ ఏంటంటే.. సితార్ ఎప్పీయరెన్స్. అవును.. మహేష్ బాబు నటించిన సినిమాలో ఓ పాటకు సితార డాన్స్ చేసింది. అందుకే దీన్ని లిరికల్ వీడియో అనకుండా మ్యూజిక్ వీడియో అన్నారు.

పెన్నీ అనే లిరిక్స్ తో అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా.. నకాష్ అజీజ్ ఆలపించాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టు ఈ లిరికల్ వీడియో కోసం కూడా భారీ సెటప్ పెట్టి పిక్చరైజ్ చేశారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ వీడియోకు మెయిన్ హైలెట్ గా సితార నిలిచింది. తండ్రి పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. మరీ ముఖ్యంగా పెన్నీ సిగ్నేచర్ స్టెప్పును మహేష్ కంటే బాగా సితారనే వేసినట్టు కనిపించింది.

పాటలో మరో హైలెట్ తమన్ స్టెప్పులు. ఇన్నాళ్లూ తన లిరికల్ సాంగ్స్ కు సంబంధించి కీబోర్డ్ ప్లే చేస్తూ లేక డ్రమ్స్ వాయిస్తూ మాత్రమే కనిపించిన తమన్.. ఈసారి డాన్స్ కూడా ట్రై చేశాడు. ఓవైపు గిటార్ ప్లే చేస్తూ, మరోవైపు స్టెప్పులేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

పాట చూస్తుంటే, ఇది సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ లా అనిపిస్తోంది. మహేష్ ఎప్పట్లానే స్టయిలిష్ గా ఉన్నాడు. అతడి లుక్స్ బాగున్నాయి.

కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. మే 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

Full View

Tags:    
Advertisement

Similar News