హాలీవుడ్ రేంజ్ ఫైట్స్ చేస్తున్న సమంత

కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తోంది. ఇటు కమర్షియల్ హంగులు, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ సంస్థ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకుముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు భిన్నంగా ఇది ఉండబోతోంది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. దీని కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమౌతోంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌ నేతృత్వంలో […]

Advertisement
Update:2022-03-20 12:44 IST

కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తోంది. ఇటు కమర్షియల్ హంగులు, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ సంస్థ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకుముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు భిన్నంగా ఇది ఉండబోతోంది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. దీని కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమౌతోంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌ నేతృత్వంలో ట్రయినింగ్ తీసుకుంటోంది.

‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశాడు. అందులో యాక్షన్ సీన్స్‌ను ఆయన డైరక్ట్ చేశాడు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్‌లో జరిగే షెడ్యూల్‌లో తీయాలని ప్లాన్ చేశారు. 3 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది.

సమంతతో పాటు కొంతమంది ఫైటర్స్ తో 10 రోజుల పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. దీని కోసం 3 భారీ సెట్స్‌ వేశారు. సమంత ఎంతో కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేసిందని యూనిట్ సభ్యులు మెచ్చుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు.

Tags:    
Advertisement

Similar News