ఆర్ఆర్ఆర్.. రేపట్నుంచి రచ్చ రచ్చే

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రచారం ఊపందుకుంది. రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇక రేపట్నుంచి సినిమా ప్రచారం ఓ రేంజ్ లో జరగబోతోంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. 5 రోజుల గ్యాప్ లో దేశం మొత్తం చుట్టేశాలో షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు. దుబాయ్ ఈవెంట్ తో ఆర్ఆర్ఆర్ ప్రచారం ఊపందుకోనుంది. రేపు ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం దుబాయ్ వెళ్లబోతోంది. అక్కడో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అది పూర్తయిన తర్వాత 19వ తేదీన […]

Advertisement
Update:2022-03-17 12:01 IST

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రచారం ఊపందుకుంది. రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇక రేపట్నుంచి సినిమా ప్రచారం ఓ రేంజ్ లో జరగబోతోంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. 5 రోజుల గ్యాప్ లో దేశం మొత్తం చుట్టేశాలో షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు. దుబాయ్ ఈవెంట్ తో ఆర్ఆర్ఆర్ ప్రచారం ఊపందుకోనుంది.

రేపు ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం దుబాయ్ వెళ్లబోతోంది. అక్కడో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అది పూర్తయిన తర్వాత 19వ తేదీన అట్నుంచి అటే బెంగళూరుకు వెళ్తుంది టీమ్. అక్కడో పెద్ద ఈవెంట్ పెట్టారు. ఇక 20వ తేదీన బరోడా, ఢిల్లీలో.. 21వ తేదీన అమృతసర్, జైపూర్ సిటీస్ లో, 22న కోల్ కతా, వారణాసిలో భారీ ప్రచారం చేయబోతున్నారు. ఇక వారణాసి నుంచి 23న హైదరాబాద్ వస్తుంది యూనిట్. దీంతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది.

24న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రివ్యూస్ ఏర్పాటు చేస్తున్నారు. 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్ తో కలిపి 450 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News