ఈసారి హిట్ గ్యారంటీ అంట
చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు హీరో రాజ్ తరుణ్. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొడతానని చెబుతున్నాడు. దీనికి కారణం అతడు చేసిన స్టాండప్ రాహుల్ సినిమా. రేపు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ తరుణ్.. స్టాండప్ రాహుల్ సినిమాలో అన్నీ ఉన్నాయంటున్నాడు. “నాకు ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా ఇది. అగస్త్య రెండేళ్ళు ఈ సినిమాకే పనిచేశాడు. ఇంద్రజ, మురళీశర్మ, వెన్నెల కిశోర్ మొదలైనవారితో పనిచేయడం గొప్పగా వుంది. […]
;చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు హీరో రాజ్ తరుణ్. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొడతానని చెబుతున్నాడు. దీనికి కారణం అతడు చేసిన స్టాండప్ రాహుల్ సినిమా. రేపు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ తరుణ్.. స్టాండప్ రాహుల్ సినిమాలో అన్నీ ఉన్నాయంటున్నాడు.
“నాకు ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా ఇది. అగస్త్య రెండేళ్ళు ఈ సినిమాకే పనిచేశాడు. ఇంద్రజ, మురళీశర్మ, వెన్నెల కిశోర్ మొదలైనవారితో పనిచేయడం గొప్పగా వుంది. ఇందులో నేను బాగా నటించానంటే కారణం వర్ష బొల్లమ్మ. దర్శకుడు శాంటోతో పనిచేయడం హ్యాపీగా వుంది. సినిమా మాకు నచ్చింది. మీకూ నచ్చుతుంది. ఫ్యామిలీడ్రామాతో కూడిన రొమాంటిక్ కామెడీ ఇది.”
సాధారణంగా సినిమాల్లో ఏవో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని.. కానీ స్టాండప్ రాహుల్ లో అన్నీ ఉన్నాయంటున్నాడు రాజ్ తరుణ్. మదర్ సెంటిమెంట్, లవ్, కామెడీ, థ్రిల్, మంచి లొకేషన్స్, పాటలు, డైలాగ్స్.. ఇలా అన్నీ మిక్స్ చేస్తే అది స్టాండప్ రాహుల్ అవుతుందని చెబుతున్నాడు. రేపు ఈ సినిమా జాతకం తేలిపోతుంది.